ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో విద్యార్థులు రాసే పదో తరగతి పరీక్షలు కరోనా విజృంభణ వల్ల ఈ ఏడాది ఆలస్యంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరగబోయే పరీక్షలను అధికారులు కొత్త పద్ధతిలో నిర్వహించనున్నారని తెలుస్తోంది. సాధారణంగా పదో తరగతి విద్యార్థులు ప్రతి సంవత్సరం 11 పేపర్లు రాయాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది విద్యాశాఖ పరీక్ష పేపర్లను 11 నుంచి 7కు కుదించింది.
ఫిజికల్ సైన్సు, బయాలజీ పేపర్లను 50 మార్కులకు వేర్వేరుగా నిర్వహించనుండగా మిగిలిన పేపర్లను 100 మార్కులకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ప్రశ్నలకు జవాబులు రాసేందుకు 2.30 గంటల సమయం కేటాయిస్తుండగా ప్రశ్నపత్రం చదవడానికి అదనంగా పావుగంట సమయం ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.
కరోనా విజృంభణ వల్ల పరీక్షలు ఆలస్యంగా జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది జులై 21వ తేదీ నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కానుందని సమాచారం. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలలో ప్రతి పేపర్ లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు – 12, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు – స్పల్ప సమాధాన ప్రశ్నలు – 8, స్పల్ప సమాధాన ప్రశ్నలు – 8, వ్యాసరూప ప్రశ్నలు – 5 ఉంటాయి. 100 మార్కులకు మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది.
కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైనా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు సాధారణంగా తరగతులు జరుగుతాయని తెలుస్తోంది. మరోవైపు ఇంటర్ పరీక్షలు మే నెల 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి.