
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. నాలుగు విడతల్లో నిర్వహించిన పోలింగ్.. నిన్నటితో ముగిసింది. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం.. ఎన్నికలు పార్టీలకతీతం. అయితే.. ఏపీలో పొలిటికల్ సూపర్ యాక్టివిజం ఉంది. ఈ కారణంగా మైనర్ గ్రామాల్లోనూ పార్టీలున్నాయి. గ్రూపులున్నాయి. దీంతో పార్టీ సానుభూతి పరుల వారీగానే ఎన్నికలు జరిగాయి. లోకల్ క్యాడర్ స్ట్రెంత్‌ను పంచాయతీ ఎన్నికలు బలోపేతం చేస్తాయి. అందుకే ఏపీలో అధికార, విపక్ష పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో పూర్తిస్థాయి రాజకీయం చేసేశాయి.
Also Read: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కూతురు వాణిదేవి : కేసీఆర్ వ్యూహం అదేనా
ఓ వైపు పార్టీలతో సంబంధం లేకున్నా.. కౌంటింగ్ ప్రారంభం కాక ముందే గెలుపు తమదంటే తమదని చెప్పుకోవడం ప్రారంభించాయి. ఎవరు ఉధృతంగా ప్రచారం చేసుకుంటే వారిదే విజయమన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు పోను నాలుగు విడుతల్లోనూ దాదాపుగా 11 వేల పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 3 వేల పైచిలుకు పంచాయతీల ఓటర్లు తాము ఓటు హక్కు వినియోగించుకోకుండా ఏకగ్రీవం చేసుకున్నారు. ఈ 11 వేల పంచాయతీల్లో తమ ఊరు బాగు కోసం ఎవరు ఉపయోగపడతారో ప్రజలు వారినే ఎన్నుకున్నారు.
ఈ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి ఫైనల్ డెసిషన్ ప్రజలదే. వారు ఎవరిని అనుకుంటే వారినే ఎన్నుకుంటారు. అందుకు పార్టీతో సంబంధం కూడా ఏమీ ఉండదు. ఈ విషయాన్ని టీడీపీ, వైసీపీలు రెండూ గుర్తించాయి. అందుకే.. నిజంగా గ్రౌండ్‌లో ఎంత గెలుస్తామన్న దాని కన్నా ప్రచారం మాత్రం పీక్స్‌లో ఉండేలా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. పంచాయతీ కిరీటం తమదంటే తమదని ప్రచారం చేసుకున్నారు. ఎవరైనా ముఖ్య నేత స్వగ్రామంలో ఓడిపోతే పండుగ చేసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారిందని తేల్చేస్తున్నారు.
Also Read: మరో ప్రాంతాన్ని చేజిక్కించుకుంటున్న బీజేపీ: పుదుచ్చేరిలో కూలిన కాంగ్రెస్ ప్రభుత్వం..
వచ్చే నెలల మున్సిపల్ పోరు ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలు పూర్తిగా పార్టీ గుర్తులతోనే ఉంటాయి. వచ్చే నెల పదో తేదీన పోలింగ్ జరగనుంది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు వెల్లడవుతాయి. నిజానికి ఇప్పుడు గెలుపెవరిదో వారు ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే బ్యాలెట్ తీర్పు ద్వారా వెల్లడిస్తారు. కానీ.. అప్పటి వరకూ ఆగకుండా పంచాయతీల్లోనే గెలిచేశామని రెండు పార్టీల నేతలు సంబరపడిపోతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్