AP Social Media : రాజకీయాల( politics) తీరు మారింది. గతంలో ఫలానా గ్రామంలో ఫలానా వ్యక్తి రాజకీయం చేసేవాడు అనే పరిస్థితి ఉండేది. ఆ నేతకు నియోజకవర్గస్థాయిలో ప్రాధాన్యం ఉండేది. పార్టీ అనుబంధ విభాగాలు కూడా బాగానే పనిచేసేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పార్టీలో ఇప్పుడు సోలో పెర్ఫార్మెన్స్ నడుస్తోంది. అదే సోషల్ మీడియా వింగ్. సోషల్ మీడియాలో రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం అందులో పని చేసే వారి విధి. అధికారంలో ఉన్నవాళ్లు ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా పోస్టులు పెడుతుంటారు. ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలపై ప్రచారం చేస్తుంటారు. ప్రతిపక్షాలు అయితే మరి చెప్పనవసరం లేదు. ప్రభుత్వంపై బురద జల్లడమే ఆ పార్టీ సోషల్ మీడియా పని. అయితే ఈ సోషల్ మీడియాలో పనిచేసే వారికి పార్టీలు వేతనాలు ఇస్తుంటాయి. ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఈ క్రమంలో వారు విపరీతంగా పార్టీ పట్ల ఎడిట్ అవుతారు. ప్రత్యర్థులకు టార్గెట్ అవుతారు. కానీ క్షేత్రస్థాయిలో వారి కుటుంబ పరిస్థితులు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటాయి.
Also Read : మీ సేవలు చాలు.. మాజీ మంత్రికి తేల్చి చెప్పిన జగన్!
* లక్షలాది మందికి ప్రత్యర్థిగా..
ఇటీవల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అరెస్టయ్యారు ఐటిడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్( chebrolu Kiran ). సభ్య సమాజం తలదించుకునేలా ఆయన చేసిన కామెంట్స్ పెను దుమారానికి దారితీసాయి. అయితే ఆయన ఓ సాధారణ యువకుడు. రాజకీయ నాయకుడు కూడా కాదు. ఐ టిడిపిలో ఒక కార్యకర్త మాత్రమే. కానీ ఇప్పుడు లక్షలాదిమందికి ఆయన ప్రత్యర్థి అయిపోయారు. అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై మాట్లాడడమే. ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు విశేష జనాదరణ ఉంది. ఆయన కుటుంబం పై అనుచితంగా మాట్లాడితే ఆయనను అభిమానించేవారు తప్పకుండా వ్యతిరేకం అవుతారు కదా. కచ్చితంగా చేబ్రోలు కిరణ్ పతనాన్ని వారు కోరుకుంటారు. అయితే ఇంతలా జనాల్లో ద్వేషం పెంచుకున్న చేబ్రోలు కిరణ్ కుటుంబ పరిస్థితి తెలిస్తే.. అంతా షాక్ అవుతారు.
* సాధారణ కుటుంబం..
చేబ్రోలు కిరణ్ ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు ఇద్దరు రోజువారి కూలీలే. తండ్రి ప్రమాదంలో గాయపడి మంచానికి పరిమితం అయ్యాడు. తల్లి ఆయనకు సఫర్యలు చేస్తూ రోజువారి కూలికి కూడా దూరమైంది. నెలనెలా జీతంతో వారిని పెంచి పోషిస్తూ వస్తున్నాడు కిరణ్. ఇప్పుడు కిరణ్ కేసుల్లో చిక్కుకున్నాడు. కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అందుకు భారీగా డబ్బులు కూడా అవసరం. అయితే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన కిరణ్.. క్షేత్రస్థాయిలో వారి కుటుంబ పరిస్థితి చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అయితే ఇది ఒక చేబ్రోలు కిరణ్ పరిస్థితి కాదు. దాదాపు రాజకీయ పార్టీల సోషల్ మీడియా లో పనిచేసే మెజారిటీ కార్యకర్తలది ఇదే పరిస్థితి. ఎనలేని ప్రాధాన్యంతో పాటు నెలవారి వేతనానికి వారు అలవాటు పడతారు. కానీ ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ అవుతారు. మొన్నటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా పని చేసిన చాలామంది యువకులు.. అజ్ఞాతంలోకి వెళ్లి పోవాల్సి వచ్చింది. రేపు అధికారం తారు మారు అయినా.. టిడిపి సోషల్ మీడియా సభ్యులకు కూడా అదే పరిస్థితి వస్తుంది.
* నాయకుల మధ్య పరస్పర సహకారం.. నాయకులు( leaders) బాగానే ఉంటారు. వారి మధ్య చక్కటి స్నేహం కొనసాగుతుంది. పరస్పర సహకారం కూడా అందించుకుంటారు. కానీ సోషల్ మీడియా లో పనిచేసే వారికి మాత్రం ఆ పరిస్థితి ఉండదు. ఒక పార్టీ విధానాలపై వారు ప్రచారం చేస్తే ఏ బాధ ఉండదు. కానీ ప్రత్యర్థి వ్యక్తిగత వ్యవహారాలను సైతం ఎండగడుతుంటారు కొందరు. ఈ క్రమంలో ప్రత్యర్ధులకు మించి శత్రువులను పెంచుకుంటూ పోతారు. ఈయన ఒక్కడే.. కానీ ఈయనను వ్యతిరేకించేవారు వేల మంది ఉంటారు. వారితో ఎటువంటి వ్యక్తిగత వైరం ఉండదు. అసలు ఎవరో తెలియదు. కానీ ఇలా ముఖం చూసిన వెంటనే చాలామంది విరుచుకుపడుతుంటారు. సోషల్ మీడియా వేదికగానే కుటుంబ సభ్యులపై కూడా తిట్ల దండకం అందుకుంటారు. ఒక రాజకీయ పార్టీకి పనిచేసే నేతలు ఆర్థికంగా పర్వాలేదనిపించుకుంటారు. కానీ సోషల్ మీడియాలో పనిచేసే వారి కుటుంబ పరిస్థితులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి చూస్తే దయనీయంగా ఉంటాయి. అటు ప్రత్యర్థులతో శత్రుత్వం పెంచుకుంటారు వారు. పోనీ ఆర్థికంగా బాగుపడతారు అంటే అది లేదు. ఇకనైనా అటువంటివారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read : ఆస్తి పన్ను పై గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..