AP News : సోషల్ మీడియాలో( social media) రాజకీయ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. సవాల్ విసురుతున్నారు. మొన్నటికి మొన్న ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం.. అరెస్టు చేయడం జరిగిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా టిడిపి కార్యకర్త ఒకరు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. ఆయనపై నేరుగా వైసీపీ నేతలు దాడి చేశారు. మద్యం సీసాలతో కొట్టి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : ప్రమాదంలో రాజకీయ సోషల్ మీడియా కార్యకర్తలు!
* సవాల్ చేసిన మనిషి పై దాడి..
ఓ వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ( Jagan Mohan Reddy)సవాల్ చేశాడు. ఫేస్బుక్లో కామెంట్స్ పెట్టాడు. దమ్ముంటే 2029లో గెలవాలని సవాల్ చేశాడు. అటు తరువాత ఆ వ్యక్తి మద్యం షాపులో ఉండగా ఇద్దరు వైసీపీ నేతలు వెళ్లి ఆయనతో గొడవకు దిగారు. ఖాళీ మద్యం సీసాలతో దారుణంగా కొట్టారు. సదరు వ్యక్తి వద్దని వారించినా వినలేదు. దారుణంగా ఆయనపై దాడి చేశారు. తలపై ఖాళీ సీసాలతో కొట్టడంతో సదరు వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది? బాధితుడు ఎవరు? దాడికి పాల్పడింది ఎవరు? అన్నది మాత్రం స్పష్టత లేదు. కానీ దాడికి గురైంది టిడిపి అభిమాని. దాడి చేసింది వైసీపీ నేతలు అన్నట్టు.. అర్థమవుతోంది.
* వైసిపి దూకుడును తెలియజేప్పాలని..
చేబ్రోలు కిరణ్ ( chebrolu Kiran) అరెస్ట్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి అరెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇటువంటి సమయంలో టిడిపిని ఇరుకున పెట్టేలా చేబ్రోలు కిరణ్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే వెను వెంటనే అతడ్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అరెస్ట్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు వైసీపీ నేతల ఆగడాలను చూపే క్రమంలో.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తిపై వైసీపీ దాడి చేసింది అంటూ.. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి ప్రమాదకరంగా ఆలోచిస్తుందో తెలియజెప్పే క్రమంలోనే ఇలా.. సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టినట్లు అర్థమవుతోంది. కానీ ఆ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియడం లేదు.
Also Read : గోరంట్ల మాధవ్ రచ్చ రచ్చ.. మీరు ఒకప్పుడు పోలీసే కదా?
రాజకీయాల్లో రాజకీయ విమర్శలు ఉండాలి కానీ అవి రాజకీయం వరకే ఉండాలి..ఏ సంబంధం లేని ఇంట్లో ఆడవాళ్ళ మీద వెళ్ళకూడదు అది ఏ పార్టీ వాళ్ళు చేసిన తప్పే దయచేసి ఆడవాళ్ళను దూషిస్తూ మాట్లాడకండి
జగన్ అన్నని దూషిస్తే ఆయన గమ్ముగా ఉండొచ్చు కానీ ఆయన్ని అభిమానించే వాళ్ళు ఊరికే ఉండరు..సాంపిల్ pic.twitter.com/rdlDD5MtQe— Power_Ranger_Facts (@Neninthae_) April 13, 2025