AP Secretariat : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో( Andhra Pradesh Secretariat) అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్ లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక అంచనా వేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉందా? లేకుంటే ప్రమాదమా? అన్నది తేలాల్సి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే సచివాలయంలో ఈ ప్రమాదం జరగడం పై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. సచివాలయంలో అగ్ని ప్రమాదం అనే వార్త క్షణాల్లో వ్యాపించింది. సర్వత్రా ఆందోళన నెలకొంది. కొద్దిసేపు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Also Read : పవన్ నీడలా వెంటాడుతున్న ప్రకాష్ రాజ్.. తాజాగా సంచలన ట్వీట్!
* సచివాలయం రెండో బ్లాక్ లో..
సచివాలయం రెండో బ్లాక్ లోనే( Secretariat second block ) ఈ ప్రమాదం జరిగింది. ఇదే బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనితకు చెందిన వేసి ఉన్నాయి. తెల్లవారుజామున అగ్రి ప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరు కార్యాలయం లోపల లేరు.
* బ్యాటరీల గదిలోనే..
బ్యాటరీల గదిలో( battery room ) చోటు చేసుకున్న మార్పుల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఎలాంటి నష్టం జరగలేదని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. సచివాలయంలో పూర్తి భద్రత ఉంటుంది. నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే తెల్లవారుజామున ఎవరూ లేని సమయంలోనే మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో ప్రమాదం తప్పింది.
* పోలీస్ విచారణ..
అయితే ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు( police) రంగంలోకి దిగారు. మంత్రుల పేషీలకు దగ్గరగా ప్రమాదం జరగడంతో కుట్ర కోణం ఉందా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? అని ఆరా తీసే పనిలో పడ్డారు పోలీసులు. గతంలో టిడిపి అధికారంలో ఉండే సమయంలో సచివాలయం పై ఉద్దేశపూర్వకంగా విషప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం సైతం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే!