Ap Liquor policy : ఏపీలో( Andhra Pradesh) మందుబాబులు ఖుషి అవుతున్నారు. పాత ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి వస్తుండడంతో పండుగ చేసుకుంటున్నారు. మద్యం అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఏడాదిలో 30 వేల కోట్ల మార్కు దాటుతున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల మద్యం షాపులు కలిపి ఓ నాలుగు వేల వరకు ఏర్పాటు చేసింది. పాత ప్రీమియం బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఒక్కసారిగా అమ్మకాలు పెరిగాయి. ప్రభుత్వానికి కూడా గణనీయంగా ఆదాయం సమకూరుతోంది. తాజాగా మంత్రివర్గ సమావేశంలో మరో నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించారు.
Also Read : ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. కుట్ర కోణం?
* అన్ని బ్రాండ్లు అందుబాటులోకి..
పాత ప్రీమియం బ్రాండ్లు( old premium brands ) అందుబాటులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. రోజుకు సగటున 83 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024- 25 ఆర్థిక సంవత్సరంలో 30 వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. గతం కంటే 9.1% మద్యం అమ్మకాలు పెరిగినట్లు సమాచారం. అయితే అమ్మకాలు పెరిగిన విలువ మాత్రం 0.34 శాతం మాత్రమే పెరగడం విశేషం. 99 రూపాయల మద్యం బ్రాండ్లు ఎక్కువగా అమ్మకాలు సాగడమే ఎందుకు కారణం. మరోవైపు 12 జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.
* మద్యం విక్రయాలు పెరిగినా.
మద్యం విక్రయాలు( wine sales) పెరిగినా ఆదాయం మాత్రం పెద్దగా సమకూరడం లేదు. 2023-24లో 30 వేల కోట్ల అమ్మకాలు జరిగినప్పుడు.. సుమారుగా 25 వేల కోట్ల ఆదాయం వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ ప్రారంభమైంది. కేవలం దరఖాస్తు రుసుముల రూపంలోనే రూ.1800 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రైవేటు మద్యం షాపుల ఏర్పాటుతో 99 రూపాయల క్వార్టర్ మద్యం అందుబాటులోకి వచ్చింది. అయితే మద్యం అమ్మకాల్లో 99 రూపాయల మద్యం విక్రయాలదే అగ్రస్థానం. అందుకే ఆదాయం తగ్గినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.
* బార్ లైసెన్స్ ఫీజు కుదింపు..
మద్యం పాలసీకి( liquor policy ) సంబంధించి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 3 స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజు 25 లక్షల రూపాయలకు కుదిస్తూ నిర్ణయించారు. దీంతో ఈ బార్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గతంలో మద్యం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై అనేక రకాల విమర్శలు వచ్చాయి. నాసిరకం మద్యాన్ని అధిక ధరకు విక్రయించడంతో మందుబాబుల నుంచి విమర్శలు మూటగట్టుకుంది అప్పటి ప్రభుత్వం. అందుకే కూటమి అన్ని రకాల ప్రీమియం బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే ధర విషయంలో ప్రజల నుంచి మిశ్రమ స్పందన ఉంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కంటే.. ఓటమి ప్రభుత్వంపై మద్యం విషయంలో సంతృప్తి కనిపిస్తోంది.