Kodali Nani
Big Breaking : బుధవారం ఉదయాన్నే ప్రత్యేక అంబులెన్స్ లో కొడాలి నానిని కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి తీసుకువచ్చారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆయనను వెంటనే అత్యవసర వైద్య విభాగానికి తరలించారు.. ప్రస్తుతం కొడాలి నాని ఏఐజి ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కీలక నాయకుడుగా ఉండడం.. మొన్నటిదాకా గుడివాడ ఎమ్మెల్యేగా ఉండడంతో.. ఒకసారిగా ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం వైసీపీ అగ్ర నాయకులు ఏఐజి ఆసుపత్రికి వెళ్తున్నారు.. కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నాని కొద్దిరోజులు ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. అయితే ఆయన స్నేహితుడు, సన్నిహితుడు వల్లభనేని వంశీ అరెస్టుకు గురి కావడంతో.. ఆయనను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి విజయవాడ జైలుకు వచ్చారు. ఆ సందర్భంగా కొడాలి నాని కూడా అక్కడికి వచ్చారు. పేర్ని నాని, కొడాలి నాని జైలు బయట ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అప్పుడు తాము ఏం చేస్తామో అందరూ చూస్తారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు.
Also Read : అట్లుంటదీ.. రాధాకృష్ణ, బీఆర్ నాయుడుకు ఇచ్చిపడేసిన కొడాలి నాని.. వైరల్ వీడియో
ఇంతకీ ఏమైంది..
కొడాలి నాని ఆ మధ్య అనారోగ్యానికి గురైనట్టు వార్తలు వచ్చాయి. ఆయన హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు వచ్చినట్టు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వాటిని కొడాలి నాని అనుచరులు ఖండించారు. కొడాలి నాని ఆరోగ్యంగానే ఉన్నారని.. ఎటువంటి వదంతులు నమ్మకూడదని సూచించారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత కొడాలి నాని కొద్ది రోజులు ప్రజాజీవితానికి దూరంగా ఉన్నారు. ఇటీవల ఆయన బయటికి వచ్చారు. తనదైన పంచులతో మీడియాలో ప్రముఖంగా నిలిచారు. ప్రస్తుతం కొడాలి నాని కి అత్యంత సన్నిహితుడైన వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు. ఆయనపై తీర్పును కోర్టు రిజర్వులో పెట్టింది. ఇంతలోనే కొడాలి నాని కి గుండెపోటు రావడం విశేషం. ఆయన ప్రస్తుతం హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సంబంధించి ఇప్పటివరకు ఏఐజి ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కొడాలి నాని ఏఐజి ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. గుండె వైద్య నిపుణులు ఆయనకు వైద్యాన్ని అందిస్తున్నారు. ఉదయాన్నే ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలి ప్రాంతంలోని ఏఐజి ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకువచ్చారు. కొడాలి నాని కి గుండెపోటు అని తెలియడంతో మీడియా ప్రతినిధులు ఏఐజి ఆసుపత్రికి వచ్చారు. నానికి గుండెపోటు అని తెలియడంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఏఐజి ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే దాని ఆరోగ్యం పై ఇప్పుడే ఏమీ చెప్పలేమని.. అతడికి వైద్యం అందిస్తున్నామని ఏఐజి ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
Also Read : కొడాలి నాని అరెస్ట్.. ప్రధాన అనుచరుడు వాంగ్మూలం