Homeఆంధ్రప్రదేశ్‌AP Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలపై కూటమి నేతల కీలక భేటీ.. పూర్తి వివరాలు మీకోసం..

AP Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలపై కూటమి నేతల కీలక భేటీ.. పూర్తి వివరాలు మీకోసం..

AP Sarpanch Elections: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సార్వత్రిక ఎన్నికల కంటే కూడా, ఈ ఎన్నికలనే సీరియస్ గా తీసుకుంటారు నేతలు. ఈ ఎన్నికలను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పెట్టబోతున్నామని సీఎం చంద్ర బాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీ నేతలకు అధికారిక సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా రేపు కూటమి పార్టీ నేతలు సమావేశం కానున్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలతో గొడవలకంటే , కూటమి పార్టీల మధ్య గొడవలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే అలాంటి గొడవలు , విభేదాలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైనే చర్చలు జరగనున్నాయి.

అదే విధంగా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సమన్వయ కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ , సర్పంచ్ , ఎంపీటీసీ,ZPTC ఎన్నికల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చెయ్యాలి అని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు తమ నాయకులను అలెర్ట్ చేశారు. అయితే సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగవు కాబట్టి , విపక్షం లో ఉన్న వైసీపీ తామే ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచామని తమ మీడియా చానెల్స్ లో ప్రచారం చేయించే అవకాశం ఉంది. దీన్ని సమర్థవతంగా ఎలా ఎదురుకోవాలి అనే అంశం పైన కూడా రేపు చర్చించనున్నారు. ఈ భేటీ కి చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ లతో పాటు కూటమి చెందిన ముఖ్య నాయకులు కూడా హాజరు కాబోతున్నారు.

కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కావడం లేదు. ఎందుకంటే ఆయన కుడి భుజానికి సర్జరీ కోసం ముంబై లోని అంబానీ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. విజయవంతంగా సర్జరీ ని డాక్టర్లు పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వంటి వారు కూడా పవన్ కళ్యాణ్ ని ముంబై కి వెళ్లి కలిశారు. మరో రెండు రోజుల వరకు పవన్ కళ్యాణ్ ఆ హాస్పిటల్ లోనే ఉండాల్సి వస్తుంది. ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత కనీసం 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. కాబట్టి ఒక మూడు వారాలు , లేదా నెలరోజులు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలకు దూరం గా ఉండబోతున్నట్టు సమాచారం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular