Rain in AP
AP Rains : ఏపీలో( Andhra Pradesh) హాట్ సమ్మర్ లో కూల్ కూల్ వాతావరణం. రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండు రోజులపాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉంది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఉత్తరాంధ్రలో సైతం చిన్నపాటి వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన పిడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏపీలో వర్షాలపై బులెటిన్ విడుదల చేసింది. మరో మూడు రోజుల పాటు వర్షాలపై పూర్తిస్థాయి స్పష్టత ఇచ్చింది.
Also Read : మునిగిపోయిన విజయవాడ.. 50 ఏళ్లలో ఇదే రికార్డ్.. ఏపీ ప్రభుత్వం బిగ్ అలెర్ట్!
* ఈ జిల్లాలకు వర్ష సూచన..
మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం కాకినాడలో( Kakinada) వర్షాలు పడతాయని వెల్లడించింది. సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన చేసింది. ఉరుములతో కూడిన పిడుగులు పడవచ్చని.. చెట్లు, టవర్లు, స్తంభాల కిందట నిలబడవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
* దంచి కొడుతున్న వర్షాలు..
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వర్షాలు పడ్డాయి. అల్లూరి సీతారామరాజు( Alluri Sitaram Raju), కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణ, ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, రాయచోటి, తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. కృష్ణ జిల్లా పెదవుటపల్లి లో 68.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ప్రకాశం జిల్లా సానిక వరంలో 65.2, ఎర్రగొండపాలెం లో 62 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు అయింది. మిగిలిన 18 ప్రాంతాల్లో 20 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం రికార్డ్ అయింది. శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది.
* జనాలకు కాస్త ఉపశమనం..
వేసవికాలం( summer season ) కావడం, ఎండలు మండుతున్న కాలంలో వర్షాలు పడుతుండడం ఉపశమనం కలిగించే విషయం. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉంది. 10 గంటలకు విశ్వరూపం చూపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో వర్షాలు పడుతుండడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. సాయంత్రానికి చల్లటి వాతావరణం ఉంటోంది.
Also Read : ఏపీకి చల్లటి కబురు.. ఆ రెండు ప్రాంతాల్లో వర్షాలు!