TEST Movie Review Telugu : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్న సందర్భంలో చాలామంది యంగ్ డైరెక్టర్లు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కి వస్తున్న డైరెక్టర్లు సైతం మంచి కథలతో సినిమాలను చేయడమే కాకుండా సక్సెస్ లను సాధించడం లో కూడా విజయం సాధిస్తున్నారు… ఇక శశికాంత్ లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం ‘టెస్ట్’ (TEST) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాని థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటిటి లోకి తీసుకొచ్చారు. ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే శరవణన్ (మాధవన్) అనే వ్యక్తి హైడ్రా ఫీవర్ అనే కొత్త టెక్నాలజీ ని మార్కెట్లోకి తీసుకురావాలని అనుకుంటాడు. ఇక తన భార్య అయిన కుముద(నయనతార) మాత్రం తనకు పిల్లలు కావాలనే ఉద్దేశ్యంలో ఉంటుంది. ఇక మరో పక్క అర్జున్ (సిద్ధార్థ్) అనే కుర్రాడు క్రికెట్ లో తన సత్తా చాటుకోవాలని చూస్తూ ఉంటాడు. వీళ్ళు ముగ్గురు అనుకున్న ధ్యేయాన్ని సక్రమంగా నిర్వర్తించారా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు శశికాంత్ ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకు చాలా బాగా ఎంగేజింగ్ గా తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసినప్పటికి సినిమా మాత్రం చాలా స్లో నరేశన్ తో ముందుకు సాగుతుంది… ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాని చూడాలంటే చాలా వరకు ఓపిక ఉండాలి అది కనక లేకపోతే మాత్రం ఈ సినిమాని మొదటి 15 నిమిషాలు చూసిన తర్వాత స్కిప్ చేస్తూ ఉంటారు. అంతటి స్లో నరేశన్ తో ఈ సినిమాని ఎందుకు ముందుకు తీసుకెళ్లాడో కూడా అర్థం కావడం లేదు.
ఒక రకంగా ఈ సినిమా థియేటర్ లో వర్కౌట్ కాదనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ఉంది కాబట్టి దానిని ఓటిటి ప్లాట్ఫారం లోకి తీసుకువచ్చినట్టుగా తెలుస్తోంది… ముఖ్యంగా స్క్రీన్ ప్లే ని మరికాస్త ఫాస్టాప్ చేసి ఉంటే సినిమా శరవేగంగా ముందుకు సాగేది. అలా చేయడం వల్ల సినిమా మీద హైప్ రావడమే కాకుండా కొన్ని ఎలివేషన్స్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యేవి. మొత్తానికైతే శశికాంత్ భారీ రేంజ్ లో సినిమాను తెరకెక్కించాలనే ప్రయత్నం చేసినప్పటికి ఆయన మీద ఎక్కువగా కేర్ తీసుకోకపోవడం వల్లే సినిమా అనుకున్న స్థాయిలో రాలేదనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థం అవుతుంది…
ఇక ఎమోషనల్ సీన్స్ కొన్ని ప్రేక్షకులను మెప్పించినప్పటికీ అప్పటికే సినిమా చూసే ప్రేక్షకులకు ఓపిక నశించిపోతుంది సినిమాలో వాళ్ళు ఏం చేసిన ప్రేక్షకుడికి అర్థం కాకుండా పోతుంది… ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంతగా ప్లస్ అయితే అవ్వలేదు… దర్శకుడు చెప్పాలనుకున్న కథ బాగున్నప్పటికి దాన్ని ఇంకొంచెం గ్రిప్పింగ్ గా మార్చి ఉంటే బాగుండేది. అలా చేస్తే సినిమా ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా ముందుకు సాగేది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే మాధవన్ ఇంతకు ముందు సినిమాల్లో ఎలాంటి నటనతో ప్రేక్షకులను మెప్పించాడో ఈ సినిమాలో అంతకుమించిన పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. అందువల్లే ఆయన పాత్ర వచ్చినప్పుడు సినిమా మీద కొంచెం హైప్ అయితే వచ్చింది. ఇక అక్కడి నుంచి వేరే పాత్రలకు సినిమా షిఫ్ట్ అవుతూ వెళ్ళినప్పుడు సినిమాలు చూడడానికి కూడా చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఏర్పడుతుంది…
నయనతార కూడా చాలా సెటిల్ పర్ఫామెన్స్ ఇచ్చింది. పిల్లలు లేని తల్లి ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటుంది. ఆ తల్లి ఎలాంటి వేదనను అనుభవిస్తుంది అనేది కూడా తన పాత్ర ద్వారా చాలా బాగా చూపించింది… ఒక క్రికెటర్ కష్టనష్టాలను భరించాల్సి ఉంటుంది. తను సాధించాలనుకున్న లక్ష్యాన్ని చేరుకునే లోపు ఆయన ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటాడు అనేది సిద్ధార్థ్ పాత్ర ద్వారా మనకు చూపించాడు. ఈ ముగ్గురు తమ పాత్రలకు న్యాయం చేసినప్పటికి సినిమా కంటెంట్ లో పెద్దగా విషయం లేకపోవడం వల్లే సినిమా ప్రేక్షకులను ఆశించిన మేరకు మెప్పించలేకపోయింది…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ గాని బ్యాగ్రౌండ్ స్కోర్ గాని అస్సలు బాలేదు. సినిమాలో అంతో ఇంతో ఉన్న ఎమోషన్ హైలెట్ అవ్వడానికి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది ఏ విధంగా హెల్ప్ అవ్వలేదు. అందువల్లే ఈ సినిమాను చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు సినిమా నుంచి డిస్కనెక్ట్ అయిపోతున్నాడు తప్ప సినిమాకి కనెక్ట్ అయితే అవ్వలేకపోతున్నాడు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే విజువల్స్ పరంగా కొంతవరకు ఓకే అనిపించినప్పటికి అనుకున్న స్థాయిలో రాలేదనే చెప్పాలి. మొత్తానికైతే సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి…
ప్లస్ పాయింట్స్
మాధవన్ యాక్టింగ్
మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
స్క్రీన్ ప్లే
మ్యూజిక్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 1.5/5
