Homeఆంధ్రప్రదేశ్‌AP Rain Alert : ఏపీకి బిగ్ అలెర్ట్.. ముంచుకొస్తున్న ముప్పు!

AP Rain Alert : ఏపీకి బిగ్ అలెర్ట్.. ముంచుకొస్తున్న ముప్పు!

AP Rain Alert  : తెలుగు రాష్ట్రాలకు( Telugu States) భారీ వర్ష సూచన. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడిన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. మే 19 నుంచి 23 వరకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దక్షిణ గుజరాత్ వద్ద ఈశాన్య అరేబియా సముద్రం పై వాయు తుఫాను కొనసాగుతోంది. మే 21 నాటికి కర్ణాటకలో తీరం దాటే అవకాశం ఉంది. దీని కారణంగా మే 20 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

Also Read : ఏపీలో ఆ ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెంపు!

* బెంగళూరులో భారీ వర్షాలు..
మరోవైపు అండమాన్ నికోబార్( Andaman Nicobar) దీవులకు నైరుతి రుతుపవనాలు తాకాయి. ఈనెల 27న కేరళకు తాకనున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షాలు పడుతున్నాయి. మన రాష్ట్రానికి సంబంధించి రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వీధులతోపాటు ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. రోడ్డు మీద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరు వాసులు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు.

* రానున్న మూడు రోజుల్లో..
రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు( heavy rain) పడే సూచన కనిపిస్తోంది. ఆ సమయంలో భారీ ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అనకాపల్లి, అన్నమయ్య, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కడప జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

* జూన్ మొదటి వారంలో ఏపీకి..
మరోవైపు జూన్ మొదటి వారంలో( June first week ) ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. ఆ సమయంలో భారీ తుఫాన్లు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది గతం కంటే భిన్నంగా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మొత్తానికి అయితే ముందుగానే రుతుపవనాల రాకతో చల్లటి వాతావరణం రానుంది.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version