Homeఆంధ్రప్రదేశ్‌AP Rain Alert: ఏపీలో ఐదు రోజులు.. బిగ్ అలెర్ట్!

AP Rain Alert: ఏపీలో ఐదు రోజులు.. బిగ్ అలెర్ట్!

AP Rain Alert: వాతావరణంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాబోయే ఐదు రోజులపాటు వర్ష వాతావరణం ఉంటుందని తేల్చి చెప్పింది. ఏపీతోపాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతాయని చెబుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితులతో ఈ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఏపీకే కాదు తెలంగాణలో సైతం చాలా జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

* అల్పపీడన ప్రభావం..
ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో వర్షాలు కూడా పడ్డాయి. అయితే తీరం దాటిపోయింది అల్పపీడనం. బలహీనంగా కూడా మారింది. దీంతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. దీని ప్రభావంతో ప్రధానంగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈనెల 11 వరకు ఈ ఈదురుగాలుల తీవ్రత కొనసాగనుంది. బలమైన గాలుల వల్ల చెట్లు, స్తంభాలు కూలిపోయే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. రాబోయే 48 గంటలపాటు ఏపీతోపాటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఈ వర్షాలు కొనసాగనున్నాయి.
* ప్రధానంగా తెలంగాణలో ఆదిలాబాద్, కొమరం భీం, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి వంటి జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండనుంది.
* ఏపీకి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యంలో సైతం ఈ వర్షాలు కొనసాగుతాయి. మిగిలిన జిల్లాల్లో కూడా ఆకాశం మేఘావృతమై.. అక్కడక్కడ తేలికపాటి చినుకులు పడే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఉరుములతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఏపీ విపరీత నిర్వహణ సంస్థ ప్రత్యేక సూచనలు జారీ చేసింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...

Arunachalam Moksha Margam: అరుణాచలం మోక్షమార్గం.. తెలుగు భక్తులకే ఎందుకీ కష్టాలు..

Arunachalam Moksha Margam: అప్పుడెప్పుడో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అరుణాచలంలో ప్రదక్షిణలు చేయాలని.. మోక్ష మార్గం నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఆయన చెప్పడమే ఆలస్యం తెలుగు భక్తులు అప్పటినుంచి...

Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్.. నీ కష్టం పగ వాడికి కూడా రావద్దు బ్రో

Suryakumar Yadav:  అతడి నాయకత్వంలో టీమిండియా టి20 లలో ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు.. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా అద్భుతం చేస్తే.. 2026లో...
Oktelugu Epaper
Exit mobile version