Peddi : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్(Global Star Ram Charan) ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. #RRR తర్వాత వస్తున్న చిత్రం కావడంతో మెగా ఫ్యాన్స్ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ రావడం వాళ్ళు తీవ్రమైన నిరాశకు గురయ్యారు. ఇప్పట్లో ఈ సినిమా ఇచ్చిన షాక్ నుండి తేరుకోలేరేమో అని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ‘పెద్ది'(Peddi Movie) మూవీ గ్లింప్స్ కేవలం మెగా అభిమానులకు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులకు కూడా మంచి కిక్ ని ఇచ్చింది. ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో నే కనిపిస్తూ ఉండేది. ముఖ్యంగా రామ్ చరణ్ గ్లింప్స్ చివర్లో ఆడిన సిగ్నేచర్ షాట్ ని IPL సీజన్ లో అన్ని టీమ్స్ ఎలా వాడుకున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు .
Also Read : ‘పెద్ది’ పై రామ్ గోపాల్ వర్మ వైరల్ ట్వీట్..కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!
అయితే ఈ సినిమా కేవలం క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ మీద తెరకెక్కుతున్న సినిమా అనుకుంటే పొరపాటే అని డైరెక్టర్ బుచ్చి బాబు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం లో అనేక రకమైన క్రీడలు ఉంటాయని, రామ్ చరణ్ అన్ని ఆటల్లోనూ నిష్ణాతుడని అభిమానులు బుచ్చి బాబు చెప్పిన మాటలను డీ కోడ్ చేసి సోషల్ మీడియా లో చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుండి లీక్ అయిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో ఎదో మట్టి తుఫాను వచ్చినట్టుగా పది అడుగుల ఎత్తు మట్టి పైకి లేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. అసలు ఏమి ప్లాన్ చేస్తున్నారు రా బాబు అంటూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘దేవర’ తర్వాత ఆమె ఒప్పుకున్న రెండవ తెలుగు సినిమా ఇది. హిందీ లో చాలా సినిమాలు చేసింది కానీ, సక్సెస్ మాత్రం అందుకోలేదు. కానీ తెలుగు లో మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ‘పెద్ది’ తో కూడా ఆమె మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం లో మెగా ఫ్యామిలీ అత్యంత సన్నిహితుడైన కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ముఖ్యమైన క్యారక్టర్ చేస్తున్నాడు. ఆయనకు సంబంధించి ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read : పెద్ది మూవీకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ మైనస్ కానుందా.?
He Rises from the Soil & settle downs the dust ️
From the Shoot Location of #PEDDI.@AlwaysRamCharan pic.twitter.com/mHHokHFreg
— Trends RamCharan ™ (@TweetRamCharan) May 18, 2025