AP Polytechnic Lecturers Salary Hike : వాళ్ల జీతం కూడా తగ్గకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ లెక్చరర్లకు సంబంధించి పోస్టుల రేషనలైజేషన్ కు సంబంధించి విచారణకు డిమాండ్లు వస్తున్నాయి. జాతీయ వైద్య కమిషన్ సలహాదారుడిగా డాక్టర్ శ్రీహరిబాబు నియమితమయ్యారు. ప్రభుత్వం హెల్త్ ఎడ్యుకేటర్ల హోదాను వైద్య మరియు ఆరోగ్య శాఖలో మార్చింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ లెక్చరర్లకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒప్పంద లెక్చరర్ల సేవలను ప్రభుత్వం పునరుద్ధరణ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారి చేసింది. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో ఇప్పటికే పని చేస్తున్న 39 ఒప్పంద లెక్చరర్స్ తో పాటు 116 వర్క షాప్ సిబ్బంది సేవలను కూడా పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం వీళ్ళ సేవలను జూన్ 1, 2025 నుంచి ఏప్రిల్ 30, 2026 11 నెలలపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీస్ ను పొడిగిస్తూ ప్రభుత్వం వీరికి నెలకు రూ.61,960 జీతం చెల్లించేలాగ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : తల్లికి వందనం అర్హతలు, మార్గదర్శకాలపై ఉత్కంఠ!
నిజానికి డైరెక్టరేట్ వీరి జీతాన్ని రూ.54,060 కి తగ్గించేందుకు ప్రతిపాదనలను పంపించింది. అయితే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లెక్చలర్ల అభ్యర్థన మేరకు వారి జీతం తగ్గకుండా పూర్తి చర్యలు తీసుకున్నట్లు పాలిటెక్నిక్ ఆల్ కాంట్రాక్టు లెక్చరర్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. అధ్యాపకుల సంఘాలు పాలిటెక్నిక్ లెక్చర్ వల్ల పోస్టుల రేషనాలైజేషన్పై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పోస్టులకు సంబంధించి హేతుబద్ధీకరణ సరిగ్గా జరగలేదని ఈ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీటిపై సరైన విచారణ జరపాలని గౌరవాధ్యక్షుడు వంటేరు శ్రీనివాసరెడ్డి.
ఈ క్రమంలో ఆయన విద్యార్థుల సంఖ్యను పరిగణ లోకి తీసుకోకుండానే కొన్ని కాలేజీ లలో అవసరం లేకుండానే పోస్టులు ఇచ్చారని తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం కడప జిల్లా సింహాద్రిపురం పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ముగ్గురు ఫిజిక్స్ లెక్చరర్స్ ను కేటాయించారు అని తెలిపారు. అలాగే మెకానికల్ విభాగంలో సీనియర్ లెక్చరర్ ను అవసరం లేకపోయినా కూడా నియమించారని తెలిపారు.