AP Pensions : పింఛన్ల విషయంలో కూటమి ప్రభుత్వం( Alliance government) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పింఛన్ల జారీకి ముందు బోగస్ పింఛన్లను తొలగించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి భారీగా అవకతవకలు ఉన్నాయని గుర్తించింది. ముఖ్యంగా 6 వేల రూపాయల పింఛన్ పొందుతున్న వారిలో చాలామంది అనర్హులను గుర్తించారు. ఇప్పటికే దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులకు వైద్య బృందాలు తనిఖీలు చేశాయి. ఇప్పటివరకు మూడు లక్షల మందికి పరీక్షలు చేయగా.. 65 వేల మందికి పైగా అనర్హులు ఉన్నట్లు తేలింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సదరం సర్టిఫికెట్ల జారీలో భారీగా తప్పులు జరిగాయని అధికారులు గుర్తించారు. అయితే ఇప్పుడు ఆ పింఛన్లపై కత్తి వేలాడుతోంది.
Also Read : ఏపీలో పెన్షన్లు.. నేటి నుంచి దరఖాస్తులు.. మార్గదర్శకాలు ఇవే!
* సదరం సర్టిఫికెట్లు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున పింఛన్లు మంజూరు చేశారు. అయితే దివ్యాంగులకు సంబంధించి పింఛన్లలో భారీగా అవకతవకలు జరిగాయి. ఇదే విషయంపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. దివ్యాంగ పింఛన్ లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వైద్యుల బృందం తనిఖీలు చేపట్టింది. అయితే అందులో చాలావరకు అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు తేలింది. అయితే ఇప్పుడు రూ.6000 పింఛన్ పొందుతున్న వారి జాబితాను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆరోగ్యశాఖ, సెర్ఫ్ అధికారులు కలిసి ఫిబ్రవరి నుంచి దివ్యాంగులకు మళ్లీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు మూడు లక్షల మందికి పరీక్షలు చేయగా.. అందులో 65 వేల మంది అనర్హులుగా తేలినట్లు సమాచారం.
* కొనసాగుతున్న వైద్య పరీక్షలు..
సాధారణ వైకల్యం( general handicapped) ఉన్నవారికి ప్రభుత్వం నెలకు 6000 పింఛన్ మొత్తాన్ని అందిస్తోంది. ఐదు రకాల వైకల్యాలు ఉన్నవారికి విభజించి మరి పింఛన్లు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పిలిచి పరీక్షలు చేయిస్తున్నారు. అయితే ఇందులో ఎక్కువ మంది లబ్ధిదారులకు ఆర్థో సమస్యలు ఉన్నాయి. మిగిలిన వారికి ఈఎన్టీ, కంటి చూపు లోపం, మానసిక సమస్యలు ఉన్నవారు ఉన్నారు. అయితే ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎక్కువమంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు.
* మూడింట ఒకటో వంతు అనర్హులు..
ముఖ్యంగా మంచానికి పరిమితమైన దీర్ఘకాలిక రోగులకు( long diseases patients ) 15వేల రూపాయలు చొప్పున పింఛన్ అందుతోంది. అయితే వారిలో 7256 మంది అనర్హులుగా తేలారు. మొత్తం 24, 091 మంది ఉండగా… అందులో మూడింట ఒకటో వంతు అనర్హులని తేల్చారు అధికారులు. ఇప్పుడు 6000 రూపాయల పింఛన్లు అందుకుంటున్న వారిలో ఏకంగా 65 వేల మందికి పైగా అనర్హులు ఉన్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. తక్కువ వైకల్యం ఉన్న ఎక్కువ శాతం అంటూ సదరం ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఇప్పుడు వీరందరిపై కత్తి వేలాడుతోంది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా దివ్యాంగ పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి.. ఈనెల మొదటి వారం నుంచి సదరం ద్వారా వైద్య పరీక్షలు చేస్తున్నారు. మొత్తానికి అయితే పింఛన్ల విషయంలో కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టడం విశేషం.
Also Read : ఏపీలో భారీగా బోగస్ పింఛన్లు.. ఆ నెల నుంచి కట్!