Rajamouli : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో పలు రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఏకైక దర్శకుడు రాజమౌళి(Rajamoul)… ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు… ఇక ఇదిలా ఉంటే తను అనుకున్నట్టుగానే సూపర్ సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
‘స్టూడెంట్ నెంబర్ వన్’ (Student Number One) సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాజమౌళి అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆయనకు గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇక మీదట నుంచి ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకుంటున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి తమకంటూ ఒక సపరేటు ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనాలను క్రియేట్ చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన మహాభారతం సినిమాని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
ఇక ఎప్పటినుంచో రాజమౌళి తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్ని తెరకెక్కిస్తాను అంటూ పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నప్పటికి అది ఇప్పుడు వర్క్ అవుట్ అయింది. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటున్న రాజమౌళి ఇకమీదట చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
అయితే మహాభారతంలో ఎవరెవరు నటించబోతున్నారు అనే దానిమీద సరైన క్లారిటీ అయితే లేదు కానీ కొంతమంది యాక్టర్ల విషయంలో రాజమౌళి వాళ్ళు తప్పకుండా నటిస్తారంటూ కొన్ని సందర్భాల్లో హింట్ అయితే ఇచ్చాడు. ఇక అందులో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), మహేష్ బాబు(Mahesh Babu), రామ్ చరణ్ (Ram Charan) లాంటి నటులైతే ఉంటారు.
ఇక వాళ్లతో పాటుగా రీసెంట్ గా నాని కూడా ఉండబోతున్నాడు అనే క్లారిటీ అయితే ఇచ్చాడు. మరి దానికి అనుగుణంగానే తన నెక్స్ట్ ప్రాజెక్టుగా ఈ సినిమాని బరిలోకి దింపి సూపర్ సక్సెస్ ని సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
Also Read : 3000 మందితో పడవలో మహేష్ బాబు పోరాటం..రాజమౌళి మార్క్ సన్నివేశం!