AP News :ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ముగిశాయి. అనంతరం సాంస్కృతిక సంబరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకల్లో వైసీపీకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనలేదు. దీంతో కొందరు మాత్రం ఫోటో సెషన్ కు హాజరు అయ్యారు. ఈ వేడుకల్లో రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఆయన నటనకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుతో సహా పలువురు నేతలు ముగ్ధులయ్యారు.
Also Read : అయ్యన్నకు తానా ఆహ్వానం.. మహాసభలకు రావాలని సభాపతికి వినతి
దానవీర శూర కర్ణ నాటకంలో సుయోధనుడి పాత్రలో ఎన్టీఆర్ డైలాగులతో అదరగొట్టారు. “ఏమంటివి ఏమంటివి…” అంటూ ఆయన చేసిన ప్రదర్శన చూపరులను మంత్రముగ్ధులను చేసింది. ఆయన ప్రదర్శన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.
రఘురామకృష్ణరాజు దానవీర శూర కర్ణ నాటకంలోని దుర్యోధనుడి పాత్రలో అద్భుతంగా నటించారు. ఎన్టీఆర్ డైలాగులను ఆయన తనదైన శైలిలో పలికి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన ఆహార్యం, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. రఘు రామకృష్ణరాజు నటనకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పడిపడి నవ్వారు.ఆయన డైలాగులు, హావభావాలకు వారు ఫిదా అయ్యారు. నేతలందరూ రఘురామకృష్ణరాజు నటనను మెచ్చుకున్నారు.
పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పల్నాటి వీర కిశోరం బాలచంద్రుడి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కరతాళ ధ్వనులతో ఆయనను అభినందించారు.
జగన్ పై వ్యంగ్య స్కిట్ లు ప్రదర్శించారు. జగన్ ఏ కార్యక్రమానికి వెళ్లినా ఒకే రకమైన హావభావాలు ప్రదర్శిస్తారని, ఆయన పార్టీ నేతలు బూతులు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల విచిత్ర కోర్కెలు అనే స్కిట్ కూడా ప్రదర్శించారు.
అలాగే చంద్రబాబు నలుగురు పిల్లలను కనమని చెబుతుంటే, టీడీపీ ఎమ్మెల్యే పెళ్లి కొడుకు కాపురానికి రానని చెబుతున్నాడని, ఆయనను బతిమాలే బాధ్యత ఎమ్మెల్యేపైనే ఉందంటూ సెటైర్లు వేశారు. నారాయణ, భాష్యం సంస్థల్లో సీట్లు అడగడం, పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో సినిమా అవకాశాలు ఇప్పించమని సిఫార్సులు కోరడం వంటి అంశాలను కూడా ఇందులో ప్రస్తావించారు.
ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కొందరు నేతలు తమ ఏకపాత్రాభినయంతో ఆకట్టుకోగా, మరికొందరు తమ ప్రస్తుత పరిస్థితిని స్టేజ్ పై వివరించారు. జగన్ పై పంచ్ లు వేసిన స్కిట్ కు ఎక్కువ స్పందన లభించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నవ్వుతూ కనిపించారు. అయితే, మహిళా శాసనసభ్యులు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల సెన్సార్ డైలాగులు వినిపించడం కాస్త ఇబ్బందికరంగా మారింది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంచి వినోదాన్ని అందించాయి.
Also Read : మందక్రిష్ణ మాదిగను ఓ రేంజ్ లో ఎత్తేసిన పవన్.. కారణం ఇదే
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలలో ‘ఏమంటివి ఏమంటివి’ అంటూ దుర్యోధనుడిగా ఏకపాత్రాభినయంతో అదరగొట్టిన రఘురామకృష్ణరాజు. pic.twitter.com/N5lkoT5qx5
— Gulte (@GulteOfficial) March 20, 2025