TANA : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(Telugu Assosiation Of Narth America) (తానా) ఆధ్వర్యంలో జులై 3 నుండి 5 వరకు అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రంలోని నోవీ నగరంలో శుభర్బన్ కలెక్షన్ షోప్లేస్ వేదికగా 24వ తానా మహాసభలు జరగనున్నాయి. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభల కోసం ఏడాదికాలంగా నిధుల సేకరణ జరుగుతోంది. మరోవైపు అతిథులకు ఆహ్వాన పత్రాలు అందిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ను తానా ప్రతినిధులు తాజాగా ఆహ్వానించారు.
Also Read : చేతిలో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీ : ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో లోకేష్ కు తెలుసు
అమెరిలోని మిషిగాన్(Mishigan) రాష్ట్రంలో జూలై 3 నుంచి 5 వరకు నిర్వహించే తానా మహాసభలకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి(ayyannapatrudu)కి ఆహ్వానం అందింది. సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని తానా ప్రతినిధులు కోరారు. ఈమేరకు ఏపీ అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో ఆయనను కలిశారు. తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ల గంగాధర్, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శ్రీనివాస్ నాదెళ్ల తదితరులు అయ్యన్నపాత్రుడుకు సభ వివరాలను వివరించి, ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. తానా సంస్థ ఉత్తర అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా ప్రసిద్ధి పొందింది. ఈ సంస్థ ఉత్తర అమెరికా తెలుగు సమాజానికి సామాజిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో ముఖ్యమైన సేవలు అందిస్తోంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే తానా మహాసభలు భారతీయ సమాజంలో అతిపెద్ద సదస్సులలో ఒకటిగా నిలుస్తాయని తానా మహాసభల చైర్మన్ గంగాధర్ నాదెళ్ల తెలిపారు.
ప్రముఖుల హాజరు..
తానా మహా సభలకు సాంస్కృతిక, వ్యాపార, ఆధ్యాత్మిక, రాజకీయ, వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర రంగాల్లో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు, కళాకారులు, రచయితలు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొంటారు. ప్రతిసారి సుమారు 10,000 మందికి పైగా తెలుగు ప్రజలు ఈ మహాసభలకు హాజరవుతారని వారు పేర్కొన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడి రాక ఈ మహాసభలకు మరింత వన్నె తెస్తుందని తానా ప్రతినిధులు స్పష్టం చేశారు.
Also Read : బొత్స కోరికను కాదనలేకపోయిన పవన్!