Homeఆంధ్రప్రదేశ్‌AP Midday Meals Upgrade: వాళ్లందరి కోసం కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం.....

AP Midday Meals Upgrade: వాళ్లందరి కోసం కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం.. ఈరోజే అమలు..

AP Midday Meals Upgrade: పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల శారీరక మరియు మానసిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం 2025 -26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు అలాగే సంక్షేమ వసతి గృహాలలో కూడా చదువుకుంటున్న విద్యార్థుల అందరికీ అన్ని పోషక విలువలతో కూడిన సన్నబియ్యం ఆహారాన్ని అందించేందుకు రెడీ అవుతుంది. జూన్ నెల 12వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పేద విద్యార్థుల ఆరోగ్య భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం తీసుకొని వచ్చిన ఈ సరికొత్త పథకం మార్గదర్శక నూతన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలకు దారితీస్తుందని చెప్పొచ్చు. మధ్యాహ్నం భోజనం ద్వారా చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా ఆరోగ్యకరమైన పోషకాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజనంకు సంబంధించి రాష్ట్రంలో పలు అంశాలలో దుమ్మురేపినప్పటికీ కొన్నిచోట్ల మాత్రం బియ్యం నాణ్యత పై కూడా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

వీటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా శ్రద్ధ వహించి సన్న బియ్యాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. సన్న బియ్యాన్ని నేవిగేషన్ చేయడం చాలా ఈజీ. ఈ బియ్యం త్వరగా ఉడుకుతుంది అలాగే పిల్లలకు తినడానికి రుచిగా కూడా ఉంటుంది. ముఖ్యంగా సన్నబియ్యం ఆమ్లతత్వాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వైద్య పరంగా మరియు పోషకాల విలువల పరంగా నాణ్యమైన బియ్యాన్ని ఎంచుకోవడం వలన విద్యార్థుల ఆరోగ్యానికి బలమైన పునాది వేయగలుగుతారు. ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ సన్న బియ్యం పంపిణీ ప్రక్రియలో ఎటువంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటుంది.

ప్రత్యేక క్యూఆర్ కోడ్ ప్రతి 25 కేజీల బియ్యం సంచి పై ప్రభుత్వం ముద్రించనుంది. స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఈ కోడ్ను స్కాన్ చేస్తారు. ఇలా చేయడం వలన రాష్ట్రస్థాయి డేటా బేస్ కు ఈ బియ్యం ఎక్కడ పంపబడింది అలాగే ఎప్పుడు పంపబడింది, ఎంత పంపబడింది అన్న పూర్తి వివరాలు చేరుతాయి. బియ్యం ఎగుమతిలో ఎక్కడైనా లోపాలు జరిగితే వెంటనే ప్రభుత్వం గుర్తించగలుగుతుంది. నాణ్యత విషయంలో కూడా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే వెనక్కి పంపించేందుకు వీలుగా ఉంటుంది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular