AP Liquor Scam: మద్యం కుంభకోణం( liquor scam ) కేసులో ఈరోజు సంచలనాలు నమోదు కానున్నాయా? కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడి విషయం స్పష్టం కానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్దిరోజులుగా మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను కొనసాగిస్తోంది. దాదాపు 40 మంది వరకు నిందితులు ఉన్న.. ప్రధాన నిందితులుగా 11 మంది ఉన్నారు. అందులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి ముందుగా అరెస్టయ్యారు. అటు తరువాత అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓ ఎస్ డి కృష్ణ మనోహర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారి అరెస్టు జరిగింది. అయితే రాజ్ కసిరెడ్డి సూత్రధారి కాగా.. వెనుక ఉండి నడిపించింది మాత్రం పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అని ఆధారాలు సేకరించగలిగింది సిట్. అయితే అంతిమ లబ్ది ఎవరికి చేకూరింది అనేది మాత్రం ఈరోజు తేల్చేయనుంది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఈ కేస్ కు సంబంధించి ఛార్జ్ షీట్ నేడు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో అంతిమ లబ్ధిదారుడిగా ఉన్న ‘బిగ్ బాస్’ పేరు స్పష్టం చేసే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది.
Also Read: ఫిష్ వెంకట్ మరణానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీ యేనా..? ఎందుకు పట్టించుకోలేదు!
* పక్కా ఆధారాలతో
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి దృష్టి పెట్టింది. ప్రాథమిక ఆధారాలను సేకరించగలిగింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సైతం స్పష్టమైన సమాచారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడి నుంచి వచ్చిన గ్రీన్ సిగ్నల్ మేరకు.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. దీంతో రంగంలోకి దిగిన సీట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటి వరకు మొత్తం 40 మందిని నిందితులుగా చేర్చింది. ఓ 11 మందిని అరెస్టు కూడా చేసింది. అయితే ఈ రోజు విచారణకు అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి, రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి హాజరుకానున్నారు. అయితే మిధున్ రెడ్డి విచారణ అనంతరం.. ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం సాగుతోంది. అప్పటి ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి విషయంలో ఏం జరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది.
* అప్పట్లో మాజీ సీఎం పేరు..
ఒకానొక దశలో మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన అరెస్టు తప్పదని ప్రచారం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అదే తరహా అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటివరకు జరిగిన అరెస్టుల తీరు చూస్తుంటే మాత్రం.. జగన్ చుట్టూ ఉచ్చు బిగించినట్లు అర్థమవుతోంది. అయితే మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనలు, ఆయన ఇచ్చిన సమాచారం మేరకు సిట్ పావులు కదిపింది. మద్యం కంపెనీల యజమానులతో డీల్ కుదిర్చింది రాజ్ కసిరెడ్డి అని.. ఆ డీల్ సిట్టింగ్ లో తాను ఉన్నానని.. కానీ తనకు మాత్రం సంబంధం లేదని బహిరంగంగానే చెప్పారు విజయసాయిరెడ్డి. అయితే ఈ కేసులో ఏ 5 నిందితుడిగా ఉన్నారు విజయసాయిరెడ్డి. అయితే సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని చెప్పడం ద్వారా.. ఆయన వెనుక ఉన్నారు అనేదానిపై హింట్ ఇచ్చినట్లు అయింది. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి వెనుక ఉన్నది ఎంపీ మిధున్ రెడ్డి అని పక్కా ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు. అయితే ఎంపీ మిధున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. సో దీన్ని బట్టి అర్థమవుతోంది ప్రత్యేక దర్యాప్తు బృందం వ్యూహం.
* చార్జ్ షీట్ తో స్పష్టత..
ఈరోజు ఈ కేసుకు సంబంధించి చార్జి షీట్( charge sheet) దాఖలు చేస్తారని తెలుస్తోంది. సూత్రధారి రాజ్ కసిరెడ్డికి మార్గదర్శకం చేశారని భావిస్తున్న ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టు జరగనుంది. ఈ కేసులో అరెస్టుల తీరు చూస్తుంటే.. ఈరోజు జరిగే మిథున్ రెడ్డి అరెస్టు కీలకం. తరువాత స్టెప్ మాత్రం అంతిమ లబ్ధిదారుడదే. అంటే మద్యం కుంభకోణాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం ఒక కొలిక్కి తేనుందన్నమాట. అయితే మిధున్ రెడ్డి ఇచ్చే సమాచారం బట్టి ఈరోజు సంచలన అంశాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయడంతో.. నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు తుది చార్జ్ షీట్ నమోదు చేసే పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో?