Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani) ఆరోగ్యం పై కీలక అప్డేట్ ఇచ్చింది ఏషియన్ ఆసుపత్రి. రెండు రోజుల కిందట కొడాలి నాని కి బైపాస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. 8 గంటల పాటు శ్రమించిన వైద్యుల బృందం బైపాస్ సర్జరీ చేసింది. ప్రస్తుతం నాని ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే ఆయన విషయంలో కీలక సూచనలు చేశారు వైద్యులు. దీనికి కుటుంబ సభ్యులు సైతం సమ్మతించారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అక్కడ వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత నెల 27న అస్వస్థతకు గురయ్యారు కొడాలి నాని. విను వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షల అనంతరం గుండెపోటు అని తేలింది. మరోవైపు కిడ్నీ సమస్యలు సైతం బయటపడడంతో ముంబైలోని ఏసియన్ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
Also Read : టిడిపి వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్.. జనసేన సరికొత్త డిమాండ్.. హాట్ హాట్ గా విశాఖ పాలిటిక్స్!
* ఆది నుంచి ఆరోగ్యం పై ప్రభావం..
వాస్తవానికి కొడాలి నాని ఆరోగ్యం పై రకరకాల ప్రచారం అప్పట్లో నడిచేది. కానీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత తీవ్ర అనారోగ్యం బాధ పెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే గత నెల 27న ఇంట్లో ఉన్న కొడాలి నాని ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో అతడు కుప్ప కూలిపోవడంతో ఆందోళనకు గురయ్యారు కుటుంబ సభ్యులు. వెనువెంటనే హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రికి( AIG Hospital ) తరలించారు. అక్కడ నానిని వైద్య పరీక్షలు చేయక మూడు కవాటాలు మూసుకుపోయినట్లు గుర్తించారు. స్టంట్సు వేసేందుకు సిద్ధపడ్డారు. అయితే ఇంతలో కిడ్నీ సంబంధిత సమస్యలు బయటపడ్డాయి. వెనువెంటనే అక్కడ వైద్యుల సూచన మేరకు ముంబైలోని ఏసియన్ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కొడాలి నానిని తరలించారు.
* నెలరోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో..
ఈనెల 2న కొడాలి నాని కి బైపాస్ సర్జరీ చేశారు. ప్రముఖ గుండె వైద్య నిపుణుడు రమాకాంత్ పాండా( Dr Ramakant Panda) నేతృత్వంలోని వైద్యుల బృందం నానికి ఆపరేషన్ చేసింది. 8 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ విజయవంతం కావడంతో కుటుంబ సభ్యులతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే కొడాలి నాని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఇప్పుడే కాదని తెలుస్తోంది. మరో నెల రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు సైతం కొడాలి నానిని అక్కడే ఉంచేందుకు సమ్మతించారట. ప్రస్తుతం నాని ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులతో సైతం మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. నెల రోజులపాటు అబ్జర్వేషన్ కొనసాగుతుందని.. శరీర అవయవాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా వైద్యం అందించేందుకు ఆసుపత్రిలో ఉంచుతున్నట్లు తెలుస్తోంది.
* ఊపిరి పీల్చుకున్న వైసీపీ శ్రేణులు..
రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) శ్రేణులు కొడాలి నాని ఆరోగ్యం పై ఆందోళనతో గడిపాయి. అయితే బైపాస్ సర్జరీ విజయవంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు నాని ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సైతం కొడాలి నానిని పరామర్శించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది వైసీపీ కీలక నేతలు నాని కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేరుగా ముంబై వెళ్లి కలుసుకున్నారు. నాని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డికి వివరించారు.
Also Read : ఏపీలో మరిన్ని ప్రీమియం మద్యం బ్రాండ్లు?