AP Liquor: శత్రు దేశాల మీద యుద్ధానికి ఏపీ మద్యం.. వీడియో వైరల్

రక్షణ రంగానికి సంబంధించి ఓ టీం లీడర్.. తన బృందానికి ఒక పరీక్ష పెట్టాడు. ప్రపంచంలో ప్రత్యర్థి దేశాల్లో ఫైట్ చేసినప్పుడు అక్కడ శత్రు సైన్యానికి దొరికిపోతే ఏం చేస్తారని సదరు టీం లీడర్ ప్రశ్నిస్తాడు.

Written By: Dharma, Updated On : January 4, 2024 11:40 am

AP Liquor

Follow us on

AP Liquor: ఏపీలో దొరికే మద్యం పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంటుంది. ఇక్కడ దొరికే బ్రాండ్లను తాగలేక.. బార్డర్ లో ఉండే రాష్ట్రాలకు వెళ్లి మద్యం కొనుక్కుంటున్నామంటూ ఎన్నో రీల్స్, ట్రోల్స్ వీడియోలు వస్తుంటాయి. ఏపీ బ్రాండ్ల మీద ట్రోల్స్, మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆ వీడియోతో ఓ రేంజ్ లో విరుచుకుపడుతోంది.

రక్షణ రంగానికి సంబంధించి ఓ టీం లీడర్.. తన బృందానికి ఒక పరీక్ష పెట్టాడు. ప్రపంచంలో ప్రత్యర్థి దేశాల్లో ఫైట్ చేసినప్పుడు అక్కడ శత్రు సైన్యానికి దొరికిపోతే ఏం చేస్తారని సదరు టీం లీడర్ ప్రశ్నిస్తాడు. ఆ టీంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. ఒకరు సైనైడ్ తాగుతామని, మరొకరు గన్ తో కాల్చుకుంటానని, మరొకరు బుల్లెట్ మింగుతానని చెప్పుకొచ్చారు. ఏపీ విభాగానికి వచ్చినప్పుడు మాత్రం సభ్యుడు భిన్నంగా స్పందించాడు. ఏపీ మద్యం బ్రాండ్లు తాగి చచ్చిపోతానని.. దేశ రహస్యాలను ఆ విధంగా కాపాడుతానని చెప్పుకొచ్చాడు. సదరు టీం లీడర్ అతడిని అభినందనలతో ముంచెత్తాడు. ఇప్పుడు ఈ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా టిడిపి అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.

ఆ మధ్యనే ఏపీ మద్యం బ్రాండ్లపై సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ భిన్నంగా స్పందించారు. ఏపీకి వచ్చానని.. విజయవాడలో ఉన్నానని.. ఇక్కడి బీర్ తీసుకున్న తాగుతున్నాను అంటూ.. బూమ్ బూమ్ బీర్ తాగుతున్నట్లుగా చూపించాడు. ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదని.. ఏమవుతుందో ఏమో అంటూ భయపడుతూ మందు తాగేశాడు. అయితే ఇది సోషల్ మీడియాలో ఈ వీడియో కనిపించడంతో ఏం జరిగిందోనని నెటిజన్లు ఆందోళనకు గురయ్యారు. కానీ ఏపీ ప్రభుత్వం మీద.. అక్కడ దొరికే మందు మీద శ్రీకాంత్ అయ్యంగర్ కౌంటర్ వేశాడని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. అయితే నాడు వైసిపి పేటీఎం బ్యాచ్ శ్రీకాంత్ అయ్యంగర్ మీద ఓ రేంజ్ లో విరుచుకు పడింది. ఇప్పుడు తాజా వీడియో పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేయడం కనిపించింది.