AP KGBV Recruitment 2026: ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు తగ్గిపోతున్నాయి. మరోవైపు నోటిఫికేషన్లు వచ్చినా కాంపిటేషన్ కనీవిని ఎరుగని రీతిలో ఉంటుంది. అత్యున్నత విద్యావంతులు కూడా ప్రభుత్వ ఉద్యోగం అనగానే దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) 1095 నాన్–టీచింగ్ పదవులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. చివరి తేదీ జనవరి 20. ఈ పోస్టులు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఇంటర్వ్యూల ద్వారా మహిళా అభ్యర్థులతో భర్తీ చేస్తారు. విజయనగరం కలెక్టరేట్ వెబ్‌సైట్ (https://vizianagaram.ap.gov.in) ద్వారా ఆన్‌లైన్ అప్లై చేయవచ్చు.
అర్హతలు,పోస్టుల వివరాలు..
పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి:
– 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ, బీఈడీ, ఎంఏ ఎక్యుడేషన్, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఏఎన్‌ఎం పాస్ అయినవారు అర్హులు. ఈ ఉద్యోగాలకు మహిళలే అర్హులు. విద్యాలయాల సామాజిక, పరిపాలనా కార్యకలాపాల్లో సహాయక పాత్రలు పోషిస్తాయి. దరఖాస్తు చేసినవారిని ఇంటర్వ్యూ తర్వాత ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేసే విధానం..
వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ ఫారం డౌన్‌లోడ్ చేయాలి. అందులో పూర్తి వివరాలు ఫిల్ చేయాలి. తర్వాత అర్హతలు సరిపోతే డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి. లాస్ట్ డేట్ ముందు సమయానికి సబ్మిట్ చేయాలి. రేపటితో గడువు ముగియనుంది. వెంటనే అర్హులు దరఖాస్తు చేసుకోండి.
కేజీబీవీలు మరింత బలోపేతం
చాలా ప్రభుత్వ పాఠశాలల్లో నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యం వస్తే వైద్య సేవలు కూడా అందడం లేదు. ఉపాధ్యాయులే ప్రథమ చికిత్స చేయాల్సి వస్తుంది. ఇక విద్యార్థుల సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వెబ్‌సైట్‌లలో నమోదు చేయడం కూడా ఇబ్బందిగా మారుతోంది. తాజాగా పోస్టులు భర్తీ అయితే ఉపాధ్యాయులపై భారం తప్పుతుంది.
