New trend in Tollywood: ఒకప్పుడు ఒక సినిమా తెరమీదికి రావాలి అంటే మొదట రైటర్లు కథని రాశారు. వాళ్ళు రాసిన కథకు దర్శకుడు స్క్రీన్ పై రాసుకొని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఒకటికి పది సార్లు క్రాస్ చెక్ చేసుకొని మరి సినిమాలను తెరమీదకి తీసుకొచ్చేవారు. ఇక ఇలాంటి ప్రాసెస్ లో చాలా గొప్ప కథలైతే వచ్చాయి. అలాగే ఒక్కో క్రాఫ్ట్ ఒక్కొక్కరు చూసుకునేవారు కాబట్టి అదంతా ఒక టీం వర్క్ గా చేశారు. దానివల్ల సక్సెస్ఫుల్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి… కానీ ఈ మధ్యకాలంలో దర్శకులే రైటర్లుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి కొంతవరకు నాసిరకపు కథలైతే వస్తున్నాయి. కానీ ఇప్పుడు నయా ట్రెండ్ లో హీరోలే కథలను, స్క్రీన్ ప్లేలను రాసుకొని దర్శకులతో డైరెక్ట్ చేయించుకుని సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. సిద్దు జొన్నలగడ్డ చేసిన ‘ డీజే టిల్లు’ సినిమాకి అతనే రైటర్ కావడం విశేషం… తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథను రాసుకొని మాటల్ని పొందుపర్చుకొని సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడంలో ఆయన చాలా వరకు కీలక పాత్ర వహించాడు… ఇక ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలకు సైతం తనే రైటర్ గా వ్యవహరించడం విశేషం… ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డకి చాలా మంచి మార్కెట్ ఉంది. అతని సినిమాలు చూడడానికి చాలా మంది జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం…
క్షణం సినిమాతో తనలోని రైటర్ ను పరిచయం చేసిన శేషు ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఒక మిస్టీరియస్ థ్రిల్లర్ గా మలిచిన ఈ సినిమా తన కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. ఇక ఆ తర్వాత గూడచారి, ఎవరు లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు…
విశ్వక్ సేన్ సైతం ఫలక్ నూమా దాస్ లాంటి సినిమా కథని రాసుకొని దాన్ని డైరెక్షన్ చేశాడు..మరికొన్ని సినిమాలకు కూడా డైరెక్టర్ గా వ్యవహరించడం విశేషం…
నవీన్ పోలిశెట్టి లాంటి నటుడు తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథ డిజైన్ చేసుకుంటున్నాడు. అందుకే అతనికి 100% సక్సెస్ రేట్ ఉందని చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన నాలుగు సినిమాలకు నాలుగు సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడంలో అతని పాత్ర చాలా కీలకమనే చెప్పాలి.
ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతన్ని డిఫరెంట్ గా ప్రెసెంట్ చేసుకున్నవే కావడం విశేషం…రీసెంట్ గా అనగనగా ఒక రాజు సినిమాకి సైతం తనే మాటలు రాయడంతో ఆ సినిమాలో డైలాగులు బాగున్నాయంటూ ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు…ఇక ఈ కొత్త ట్రెండ్ ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది తెలియాల్సి ఉంది…
