Andhra Pradesh Job Calendar 2026: ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. నిన్ననే రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసింది. ఇప్పుడు ఉగాదికి మరో ప్రకటన రానుంది. జాబ్ క్యాలెండర్ ను ప్రకటించనుంది. అందుకు సంబంధించి తుది కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు పోస్టుల వారీగా ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖకు కూడా ప్రతిపాదనలు అందాయి. ప్రభుత్వం అధికారికంగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఉపాధ్యాయ పోస్టులతో పాటు దాదాపు పదివేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు కూడా విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. ముందుగా ఉగాదికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను జాబ్ క్యాలెండర్ ల రూపంలో ప్రకటించనుంది.
Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!
* ఉగాదికి ప్రకటన..
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ జరిగింది. పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్ళ భర్తీ జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున నియామకాలు కూడా జరిగాయి. అయితే మిగతా ఖాళీల భర్తీకి సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే ఉగాది నాడు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వివరిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. దాదాపు 60 ప్రభుత్వ విభాగాల్లో 10 వేల పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ను కొత్త సంవత్సరానికి ప్రకటించనుంది. ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత ఈ పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
* ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు..
ఆర్థిక శాఖకు( finance department) కీలకమైన ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయింది ఆర్థిక శాఖ. శాఖల వారీగా వివరాలు సేకరించింది. కొన్ని పోస్టులకు ఇప్పటికే ఆమోదం లభించింది. మరికొన్ని ఆ శాఖల పరిశీలనలో ఉన్నాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ పోస్టులపై ఒక క్లారిటీ రానుంది.
* ఇప్పటివరకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిన పోస్టుల్లో 470 గ్రూప్ 2 పోస్టులు, 101 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది.
* ప్రభుత్వం ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసింది. ఈ ఏడాది మరో 3 వేల పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ లో పొందుపరచనుంది. యూనివర్సిటీలో బోధన సిబ్బంది పోస్టులకు సంబంధించి పదిహేను వందలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
