Boragadda Anil Kumar
Boragadda Anil Kumar : బోరుగడ్డ అనిల్ కుమార్( boragadda Anil Kumar ) విషయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యానాలు చేసింది. ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో బోరుగడ్డ మరోసారి కేసుల ఉచ్చులో పడాల్సి వచ్చింది. గత వైసిపి ప్రభుత్వంలో కూటమినేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు బోరుగడ్డ. వ్యక్తిగత కామెంట్లకు సైతం వెనుకడుగు వేసే వారు కాదు. చాలా రకాలుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ లపై వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా విమర్శలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు కొనసాగించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా కోర్టు ధిక్కరణ కింద కూటమి ప్రభుత్వానికి ఆయన అస్త్రం అందించారు. దానిపైనే కేసులు నమోదు కావడంతో ఆయన హైకోర్టు ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.
Also Read : పోసానికి బెయిల్.. ఎక్కడో తేడా కొడుతోంది!
* సకాలంలో లొంగి పోలేని వైనం
రాజమండ్రి సెంట్రల్ జైల్లో( Rajahmundry Central Jail) రిమాండ్ ఖైదీగా ఉండేవారు బోరుగడ్డ. ఆ సమయంలో తన తల్లికి అనారోగ్యం ఉందంటూ ఆయన మద్యంతర బెయిల్ పొందారు. అయితే సకాలంలో రాజమండ్రి జైల్లో తిరిగి లొంగిపోలేదు. అదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారింది. పోలీసులు అనిల్ కుమార్ పై హైకోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు బోరుగడ్డ ఎందుకు సకాలంలో జైల్లో లొంగి పోలేదని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో బోరుగడ్డ ఇరకాటంలో పడినట్లు అయ్యింది. వాస్తవానికి బోరుగడ్డ లొంగి పోవాల్సింది ముందు రోజు సాయంత్రం. కానీ ఆయన తరువాత రోజు ఉదయం రాజమండ్రి జైలుకు వచ్చి సరెండర్ అయ్యారు. దీంతో రాజమండ్రి జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. బోరుగడ్డకు నోటీసులు జారీ చేసింది.
* లొంగిపోవడం వెనుక ఎపిసోడ్..
బోరుగడ్డ లొంగిపోవడం వెనుక పెద్ద ఎపిసోడ్( episode) నడిచింది. తన తల్లి అనారోగ్యానికి సంబంధించి సమర్పించిన డాక్టర్ ధృవీకరణ పత్రం ఫేక్ అని పోలీసులు గుర్తించారు. వెంటనే వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే.. బెయిల్ గడువు ముగిసింది. ఇంతలోనే తనకు బెయిల్ పొడిగించాలని మరోసారి బోరుగడ్డ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సైతం కోర్టు విచారణ చేసింది. కానీ పోలీసులు బలమైన ఆధారాలు సమర్పించడంతో బెయిల్ పొడిగించడం కుదరదని తేల్చి చెప్పింది. అంతేకాదు ఎక్కడున్నా సరే.. అత్యవసరంగా వచ్చి అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో జైలు అధికారుల ముందు లొంగిపోయారు బోరుగడ్డ. కానీ ఆయనపై పోలీసులు నమోదు చేసిన నకిలీ డాక్టర్ సర్టిఫికేట్ కేసు సహా.. హైకోర్టును తప్పుదోవ పట్టించారన్న కేసులు మాత్రం విచారణలో ఉన్నాయి. తాజాగా వీటిపై విచారణ జరిపిన కోర్టు.. బూరుగడ్డ వంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమని.. ఇలాంటి వారిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
* తప్పుడు ధ్రువీకరణ పత్రం పై సీరియస్..
ప్రధానంగా తప్పుడు డాక్టర్ సర్టిఫికెట్( fake doctor certificate ) సమర్పించి మద్యంతర బెయిల్ పొందిన వైనంపై విచారణ నివేదికలను సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. నిర్దేశించిన సమయంలోపు జైలు అధికారుల ముందు ఎందుకు హాజరు కాలేదు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసింది కోర్టు. దీనిపై ప్రత్యేకంగా పిటిషన్ వేయాలని.. కేసు నమోదు చేయాలని ఆదేశించడం గమనార్హం.
Also Read : మూడేళ్లు ఆగు.. సెల్యూట్ చేయిస్తా.. బాధితుడికి జగన్ భరోసా!