AP Govt: సొంతింటి కల నెరవేర్చుకోవాలని ప్రతీ ఒక్కరికీ కూడా కోరిక ఉంటుంది. మనకంటూ ఏం ఉన్నా లేకపోయిన కూడా సొంత ఇల్లు అనేది ఉండాల్సిందే. ఇల్లు నిర్మించడం కూడా చిన్న విషయమేమి కాదు. సాధారణంగా ఇల్లు కట్టాలన్నా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇల్లు నిర్మించడానికి డబ్బులు ఎలా ఖర్చు అవుతాయో.. అలాగే ప్రభుత్వం నుంచి ప్లాన్ అప్రూవల్ కూడా తెచ్చుకోవాలి. అనుమతి తెచ్చుకోవాలంటే ప్రభుత్వం చుట్టూ తిరగాల్సిందే. దీనికి ఎన్ని రోజులు సమయం పడుతుందో ఎవరూ కూడా చెప్పలేరు. ఆఫీస్, వ్యక్తిగత పనులు చేసుకుంటూ.. ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవడానికి తిరగాలంటే కష్టం. ఇలాంటి ఇబ్బందులకు పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ ప్రజలకు తెలియజేసింది. ఈ నిర్ణయంతో అనుమతుల కోసం ప్రజలు తిరగాల్సిన అవసరం లేదు.
ఇల్లు కట్టడానికి అనుమతి తెచ్చుకునే విషయంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అనుమతిలోకి వచ్చినప్పటి నుంచి తొందరగా అన్ని చేయకుండా ఒక్కోటి ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఏ పథకం ప్రారంభించిన కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండేలా చేయాలని ప్లాన్ చేస్తోంది. కాస్త ఆలస్యంగా ప్రారంభించిన కూడా తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో గృహాలు నిర్మించుకునే వారికి ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు గుడ్ న్యూస్ తెలిపింది. పట్టణాలు లేదా నగరాల్లో ఎవరైనా రెండు సెంట్లు లోపు(100 గజాలు) ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారు ప్లానింగ్ మంజూరు కోసం మున్సిపల్ ఆఫీస్‌ల చుట్టూ చెప్పులు అరిగేలా ఎక్కడికి తిరగక్కర్లేదు. దీనివల్ల అనుమతులకు డబ్బులు చెల్లించక్కర్లేదు. పేద ప్రజలకు కాస్త డబ్బు కూడా సేవ్ అయ్యినట్లే. 300 గజాలు లోపు ఇల్లు నిర్మించేవారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు సులభతరం చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
కూటమి ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకుని.. వారికి ఏ పథకం అయితే అనుకూలంగా ఉంటుందో అవే నిర్ణయాలు తీసుకుంటి. 100 గజాల్లోపు ఇళ్ల నిర్మాణాలకు అనుమతి కూడా అలానే తీసుకుంది. దీనివల్ల మద్య, పేద ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. పనులు మానుకుని ఆఫీస్‌ల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. ఇప్పటికే ప్రజల కోసం ఉచితంగా ఇసుకను అందిస్తోంది. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా తెలిపింది. ఈ గృహ నిర్మాణ విషయంలో తీసుకున్న నిర్ణయం మంచిదని, ప్రజలు కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రజలకు ఉపయోగపడే పథకాలనే తీసుకురావాలని కోరుకుంటున్నారు.