YCP Govt- NTR Health University: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును అకారణంగా మార్చి చేతులు కాల్చుకుంది అధికార వైసీపీ సర్కార్. కేవలం వైఎస్సార్ పేరు పెట్టాలన్న స్వార్థం తప్ప ఇందులో వేరే కారణం ప్రజలకు అర్థం కావడం లేదు. ఈ నిర్ణయం ఇప్పుడు వైసీపీకే ముప్పుగా మారే అవకాశం కనిపిస్తోంది. రాజకీయంగా కీలక పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ తమకు సమానమే అని ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ ఇప్పుడు వీరిద్దరి మధ్య కొత్తగా తలెత్తిన పోలికతో ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడు ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరిలో ఎవరో ఒకరినే ఎంచుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది.. కాదు టీడీపీ కల్పించింది. దీంతో నందమూరి రామారావుపై బురద జల్లే ప్రయత్నం మొదలు పెట్టింది వైసీపీ.

కొనసాగుతున్న వివాదం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుతో రాజకీయ తెనెతుట్టెను కదిల్చింది. పేరు మార్పు వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్ పేరును ఇంకెవరితో అయినా మార్చినా ఇబ్బంది ఉండకపోయేది కానీ ఏకంగా వైఎస్సార్ పేరుతో మార్చడంతో వైసీపీనే చిక్కులో పడినట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం వీరిద్దరినీ ఓన్ చేసుకునేందుకు వైసీపీ ఇప్పటివరకూ చేస్తున్న ప్రయత్నాలే. ఇప్పటివరకూ వీరిద్దరూ తమకు సమానమే అంటూ చెప్పుకుంటూ ఇప్పుడు ఒకరి పేరును మరొకరితో మార్చడంతో వైసీపీ ద్వందవైఖరి బయటపడింది. అదే సమయంలో దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పై వైసీపీ తమ వైఖరి మార్చుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది.
Also Read: BJP- NTR Health University: ఎన్టీఆర్ పేరుపై వివాదంలో బీజేపీకి ఎదుకంత హుషారు?
ఇద్దరి మధ్య ఎలాంటి పోలిక లేదు..
వైఎస్సార్–ఎన్టీఆర్ ఇద్దరు దివంగత మాజీ ముఖ్యమంత్రులు.. ఈ పోలిక మినహా ఎన్టీఆర్, వైఎస్సార్ మధ్య వాస్తవంగా ఎలాంటి పోలిక లేదు. వీరిద్దరూ కేవలం కొంతకాలం కలిసి రాజకీయాల్లో పనిచేశారు తప్ప నేరుగా ఎలాంటి వైరమూ లేదు. అలా అని స్నేహంగా కూడా లేదు. కానీ వీరిద్దరినీ తమ రాజకీయ అవసరాల కోసం వైసీపీ కలిపింది. ఇద్దరి మద్దతుదారుల ఓట్ల కోసం చేసిన ఈ ప్రయత్నమే ఇప్పుడు ఆ ఆపార్టీకి ఇబ్బందులు తెస్తోంది. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు తర్వాత వైఎస్సార్, ఎన్టీఆర్ మధ్య పోలిక తెస్తూ వైసీపీ చేస్తున్న రాజకీయాన్ని కౌంటర్ చేయడంలో టీడీపీ సక్సెస్ అయింది. వీరిద్దరి మధ్య ఎలాంటి పోలిక లేదనే అంశాన్ని జనంలోకి విజయవంతంగా తీసుకెళ్లగలిగింది. దీంతో వైసీపీ ఇరుకునపడుతోంది.

ఎన్టీఆర్‌కు వైసీపీ గుడ్ బై?
ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు తర్వాత ఎన్టీఆర్, వైఎస్సార్ మధ్య పోలిక తెచ్చేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంతో వైసీపీ ఇరుకునపడింది. ఇప్పుడు ఎన్టీఆర్ కంటే వైఎస్సార్ గొప్పోడని నిరూపించుకోవాల్సిన పరిస్దితి వైసీపీకి ఏర్పడింది. వర్సిటీ పేరు మార్పు సమర్ధించుకోవాలంటే ఇది తప్పనిసరవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చిన పోలికతో వైసీపీ ఇక వీరిద్దరిలో ఒకరినే తమ వాడిగా చెప్పుకోక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో సహజంగానే వైఎస్సార్‌ను మోస్తూ ఎన్టీఆర్‌ను పక్కనబెట్టే ప్రయత్నాలు వైసీపీ ప్రారంభించింది. ఇందులో భాగంగా తమ పార్టీలో ఉన్న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజాతో కీలక వ్యాఖ్యలు చేయించేసింది. లక్ష్మీపార్వతి తన భర్త పేరు తీసేసినా పర్వాలేదని చెప్పేస్తే, దాడిశెట్టి రాజా ఎన్టీఆర్ అంత చేతకానోడు లేడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీకి తిరిగొచ్చిన ఎన్టీఆర్ ?
తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో టీడీపీ వ్యవస్ధాపకుడైన ఎన్టీఆర్ పేరును ఇన్నాళ్లూ తమ అవసరాలకు వాడుకున్న వైసీపీ.. ఇప్పుడు వదులుకోవాల్సి వస్తోంది. వైఎస్సార్‌తో పోలిస్తే ఎన్టీఆర్ ఏమీ కాదన్నట్లుగా వైసీపీ నేతలు ఇప్పటికే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ లెగసీని వైసీపీ వాడుకునే ప్రయత్నాలకు తెరపడినట్లుగా ఎనలిస్టులు భావిస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ మరోసారి ఆయన పేరును పూర్తిస్దాయిలో వాడుకునే అవకాశం దక్కింది. వైసీపీ తమ రాజకీయ అవసరాలకు ఎన్టీఆర్‌ను వాడుకునేందుకు ప్రయత్నించి విఫలమైందన్న ప్రచారం కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశం. ఓ విధంగా చెప్పాంటే ఎన్టీఆర్ తాను స్ధాపించిన టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లి మళ్లీ అదే పార్టీకి తిరిగి వచ్చినట్లయింది.
[…] […]
[…] Also Read: YCP Govt- NTR Health University: AP government stuck with name change.. NTR to TDP again?.. YCP Utur… […]