AP Govt Reduces Electricity Charges: ఏపీ ( Andhra Pradesh)ప్రజలకు దసరా కానుకను ప్రకటించింది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా విద్యుత్ చార్జీలను తగ్గించింది. 2023లో వైసీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను ట్రూ ఆప్ కింద పెంచింది. 2024- 25 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేయగా.. అలా వసూలు చేసిన బిల్లులను నవంబరు నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకు సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రతి యూనిట్ పై 13 పైసలు చార్జీలు తగ్గనున్నాయి. దాదాపు 11 నెలల పాటు ఈ సర్దుబాటు పేరిట వినియోగదారుల కు 920 కోట్ల రూపాయల మేర చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. రాష్ట్ర చరిత్రలోనే ఏదో అరుదైన నిర్ణయమని.. దసరా కానుకగా అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
* అప్పటి పెంపు.. ఇప్పుడు భారం..
వైసిపి( YSR Congress party ) ప్రభుత్వ హయాంలో భారీగా విద్యుత్ చార్జీలు పెరిగాయి. అయితే తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని.. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమినేతలు హామీ ఇచ్చారు. అయితే గత ప్రభుత్వం పెంచిన రూ ఆఫ్ చార్జీలు ప్రభావం ఇప్పుడు కనిపించడంతో.. విద్యుత్ చార్జీలు భారీగా పెరిగాయి. ప్రజల్లో కూడా అసంతృప్తి పెరిగింది. గత ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతూ వచ్చాయి. ఈ తరుణంలో చంద్రబాబు చొరవ తీసుకొని విద్యుత్ కొనుగోలు విషయంలో పొదుపు పాటించడం.. ఇచ్చిపుచ్చుకునే విధానం పాటించడం వల్ల.. తక్కువ ధరకు విద్యుత్ లభ్యమవుతోంది. దీంతో ట్రూ ఆఫ్ చార్జీలకు బ్రేక్ వేయాలని ప్రభుత్వం భావించింది. అందుకే ట్రూ డౌన్ చార్జీల పేరిట.. విద్యుత్ చార్జీలను తగ్గించాలని నిర్ణయించింది.
* తొలిసారిగా ట్రూ డౌన్..
ఈ ఏడాది నవంబర్( November) నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకు గతంలో అధికంగా వసూలు చేసిన ట్రూ ఆప్ చార్జీలను తిరిగి చెల్లించాలని నిర్ణయించడంతో.. వచ్చే నెల నుంచి కరెంటు చార్జీలు తగ్గనున్నాయి. యూనిట్కు 13 పైసలు చొప్పున సర్దుబాటు చేయనుండడంతో.. తొలిసారిగా ట్రూ డౌన్ విధానం తీసుకొచ్చినట్లు అయింది. 100 యూనిట్లు వినియోగించిన వారికి 13 రూపాయల వరకు విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు అనేది వినిపించేది కానీ.. తొలిసారిగా తగ్గింపు అనే రికార్డును సొంతం చేసుకుంది కూటమి ప్రభుత్వం.