AP Government : ఏపీ ప్రభుత్వం( AP government) మరో నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డులు లేని వారి కోసం రెండు దశల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించనుంది. ఈనెల ఐదు నుంచి ఎనిమిది వరకు.. 12 నుంచి 15 వరకు జరిగే ఈ శిబిరాల్లో ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేయనున్నారు. జనన ధ్రువీకరణ పత్రంతో తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో ఆధార్ కార్డులు లేని చిన్నారులకు మంచి అవకాశం. రెండు దశల్లో ఈ ఆధార్ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read : విదేశాల్లో యువతకు ఉద్యోగాలు.. నెలకు రూ.3 లక్షలు.. ఏపీ ప్రభుత్వం ఒప్పందం!*
* ఆధార్ కార్డ్ అన్నింటికీ కీలకం
రాష్ట్రవ్యాప్తంగా చాలామంది చిన్నారులకు ఆధార్ కార్డులు ( Aadhar cards )లేవు. సంక్షేమ పథకాలతో పాటు రేషన్ కార్డుల్లో పేరు నమోదుకు కూడా ఆధార్ తప్పనిసరి. మరోవైపు త్వరలో రేషన్ కార్డులతో పాటు సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నారులకు ఆధార్ కార్డులు లేకపోతే ఇబ్బందులు వస్తాయని భావిస్తోంది. అందుకే ఆరేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ కార్డులు జారీ చేసేందుకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఆధార్ నమోదు కోసం తల్లిదండ్రులు చిన్నారుల బర్త్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది.
* లక్ష మందికి పైగా చిన్నారులకు ప్రయోజనం..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి పైగా చిన్నారులు జనన ధ్రువీకరణ పత్రాలు( date of birth certificate) పొందారు. కానీ ఇంతవరకు ఆధార్ నమోదు చేయించలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇప్పటికే ఆధార్ నమోదు చేయించుకుంటే.. అదే విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో తెలియజేసి.. రికార్డుల్లో నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్ నమోదు చేయించుకోని వారు.. ఈ ప్రత్యేక శిబిరాల్లో నమోదు చేయించుకోవాలని సూచిస్తున్నారు. గతంలో కూడా ఈ ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి.
Also Read : ఏపీలో 10 నెలల పాలన.. విపత్తులు, ప్రమాదాలు, వివాదాలు!