spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Government Fee Reimbursement: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!

AP Government Fee Reimbursement: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!

AP Government Fee Reimbursement: విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యాలకు ఏపీ ప్రభుత్వం( AP government) గుడ్ న్యూస్ చెప్పింది. ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. నెల రోజుల కిందట కాలేజీలకు రూ.1200 కోట్ల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ అవి అందలేదు. దానికి ప్రభుత్వం పెట్టిన మెలిక కారణం. దీనిపై కాలేజీలో యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. దీంతో తాజాగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సవరించుకుంది. వైసిపి ప్రభుత్వ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయి అలానే ఉండిపోయింది. కూటమి వచ్చిన తర్వాత ప్రాధాన్యత క్రమంలో వాటిని విడుదల చేస్తూ వస్తోంది. అయితే నెల రోజుల కిందట ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రకటన చేసింది ప్రభుత్వం. అయితే వడ్డీని మినహాయించుకుంటామని చెప్పింది. డబ్బులు లేకపోవడంతో రుణాలు తీసుకొచ్చి బకాయిలు ఇస్తున్నామని.. అందుకే ఆ అప్పు పై 7.5% వడ్డీని కాలేజీలు భరించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. దీనిపై కాలేజీల యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.

Also Read: వైసిపి చేతికి ‘ఆమె’ కొత్త బాణం!

* యాజమాన్యాల ఆందోళన..
అయితే ఫీజు రియంబర్స్మెంట్( fees reimbursements ) విడుదల చేసినా కాలేజీల ఖాతాల్లో చేరకపోవడంతో యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి. విద్యార్థులపై ఆ ప్రభావం చూపుతోంది. ఫీజుల చెల్లింపులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. అమరావతిలో కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సదస్సులో ఈ అంశంపై సీఎం చంద్రబాబు స్పందించారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారు తమ నిర్ణయాన్ని సవరించుకొని పూర్తిస్థాయిలో వడ్డీ మినహాయింపు లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ చేసేందుకు అంగీకరించారు. దీంతో ఎటువంటి కోతలు చేయకుండా ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది.

* చెల్లింపులు ప్రారంభం..
ముందుగా సాంఘిక సంక్షేమ శాఖ బీసీ డీ కేటగిరి విద్యార్థులకు సుమారు రూ.300 కోట్ల ఫీజులను ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రూ.900 కోట్ల బకాయిలను ఉగాదిలోగా విడుదల చేస్తామని ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకు హామీ ఇచ్చింది. దీంతో విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఒక కొలిక్కి వచ్చినట్లు అయింది.

* బకాయిలతో పాటు కొత్త చెల్లింపులు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో భారీగా బకాయిలు పెట్టింది. చివరకు కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ బకాయిలు అలానే ఉండిపోయాయి. అటు పాత బకాయిలతో పాటు ఇటు కొత్త చెల్లింపుల విషయంలో జాప్యం జరిగింది. అయితే ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా వేలాదిమంది ప్రైవేట్ కాలేజీల్లో చేరారు. సామాన్య మధ్యతరగతి వారు కూడా ఉన్నారు. దీంతో వారు ఎంతో ఆందోళన చెందారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ తరుణంలోనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ వడ్డీ విషయంలో నిబంధన అడ్డంకిగా మారింది. దానికి మినహాయింపు ఇవ్వడంతో.. ఇప్పుడు అడ్డంకులు తొలగి విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular