Hindupuram : సరైన వయసు వచ్చినా అతడికి పెళ్లి కాలేదు. కుమిలిపోయాడు. తీవ్రంగా బాధపడ్డాడు. చివరికి పెళ్లిళ్ల బ్రోకర్ దగ్గరికి వెళ్ళాడు. అతడు తీయని మాటలు చెబితే నమ్మాడు. మూడు లక్షలు ఎదురు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. శోభనం గురించి ప్రస్తావన తీసుకురాగానే అతడి భార్య దాటవేసింది. ఇలా పలమాలు జరగడంతో అతడు ఇప్పుడు ఏకంగా శోకాలు పెడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్య సాయి జిల్లాలోని హిందూపురం మండలంలో ఈ సంఘటన జరిగింది. సాధారణంగా పెళ్లి చేసుకున్నప్పుడు అటు ఇటు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెబుతుంటారు. కానీ నేటి రోజుల్లో పరిస్థితి అలా లేదు. పెద్దలు నిశ్చయించిన పెళ్లిళ్ల కంటే ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే అవి ఎక్కువకాలం నిలబడలేక పోతున్నాయి . యువతి యువకుల మధ్య అహాలు పెరిగిపోయి ఆగాదాలకు దారితీస్తున్నాయి. చివరికి పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. అందరి విషయంలో కాకున్నా.. చాలావరకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో రాచపల్లి ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంలో వేమారెడ్డి అనే వ్యక్తికి 40 సంవత్సరాలు. నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ అతనికి పెళ్లి కాలేదు. ఇరుగుపొరుగువారు అతడిని హేళన చేయడం మొదలుపెట్టారు. దీంతో అతడు పెళ్లిళ్ల బ్రోకర్ ను కలిశాడు.
పెళ్లిళ్ల బ్రోకర్ ఒక సంబంధం చూడగానే వేమారెడ్డి మాటకు తావు లేకుండా ఒప్పుకున్నాడు. అమ్మాయికి సంబంధించి ఎటువంటి వివరాలు తెలుసుకోకుండానే పెళ్లి చేసుకున్నాడు. భారీగా ఖర్చు పెట్టాడు. వివాహం జరిగి 12 రోజులు పూర్తవుతున్నప్పటికీ.. అతడికి ఆ కార్యం జరగలేదు. ఆ కార్యం ప్రస్తావన తీసుకు రాగానే ఆమె మాట దాటవేయడం మొదలుపెట్టింది. ఇలా రోజులు గడిచిపోయాయి. పెళ్ళికి ముందు ఆ మహిళ తనకు ఎవరూ లేరని వేమారెడ్డి తో చెప్పింది. పెళ్లి జరిగిన తర్వాత మా నాన్న చనిపోయారని అతనితో చెప్పింది. దీంతో వేమారెడ్డి ఒక్కసారిగా నివ్వెర పోయాడు. పెళ్ళికి ముందు చనిపోయాడని చెప్పిన నాన్న.. ఇప్పుడు మళ్ళీ ఎలా చనిపోయాడని ఆమెను ప్రశ్నించాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని అతడిని బెదిరించింది. దీంతో అతడు సైలెంట్ అయిపోయాడు. పట్టరాని ఆగ్రహంతో ఆమె ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తిరిగి రాలేదు. అయితే అతని భార్య గతంలో ఒకసారి తనకు భీమవరంలో ఇల్లు ఉందని చెప్పింది. అదే విషయం గుర్తుకు రావడంతో వేమారెడ్డి అక్కడికి వెళ్ళాడు. పెళ్లిళ్ల బ్రోకర్ దగ్గరికి వెళితే.. అతడు స్పందించలేదు. గ్రామాలు మొత్తం తిరిగిన వేమారెడ్డి చివరికి హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఆ మహిళపై ఫిర్యాదు చేశాడు.. అయితే పోలీసులు అతను చెప్పిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.. పెళ్లి కాలేదని బాధలో వెనుకా ముందు చూసుకోకుండా ఇలాంటి పనులు చేస్తే.. ఇబ్బంది పడక తప్పదని పోలీసులు అంటున్నారు. పెళ్లి చేసుకునే ముందు కాస్త ఆలోచించాలని హితవు పలుకుతున్నారు.