CM Chandrababu: టెక్నాలజీ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు( Chandrababu). ప్రెస్మీట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో( artificial intelligence) పనిచేసే కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. మీడియాకు అదే లైవ్ కవరేజ్ ఇచ్చింది. అందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఒకప్పుడు ఐటీ… కానీ ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్. చంద్రబాబు నోటి నుంచి తరచూ ఇదే మాట వస్తోంది. అయితే అనడమే కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని ఆయన బాగానే వాడుకుంటున్నారు. దాని ద్వారా ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో తెలుసుకొని వాటిని చేసి చూపిస్తున్నారు. తాజాగా ఆయన పెట్టిన ప్రెస్‌మీట్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిర్వహించింది. కెమెరామెన్ తో పని లేకుండా.. ఏఐ కెమెరా వ్యవస్థ పని పూర్తి చేసింది.
* కెమెరామెన్లు లేకుండా కవరేజ్
ఏపీ సీఎం చంద్రబాబు( Chandrababu) శనివారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. దేశంలో తొలిసారిగా ఏఐతో పనిచేసి కెమెరాతో.. ప్రెస్ మీట్ లైవ్ కవరేజ్ ఇప్పించారు. ఉండవల్లి లోని తన ఇంట్లో చంద్రబాబు నాలుగు కెమెరాలు ఏర్పాటు చేయించారు. సాధారణంగా ఆయన ప్రెస్ మీట్ మొదలైనప్పుడు కెమెరామెన్.. ఆ నాలుగు కెమెరాలు సెట్ చేసి.. అన్ని ఫోకస్.. రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నలుగురు కెమెరామెన్లు కావాలి. కానీ సీఎం చంద్రబాబు అక్కడ ఏఐ టెక్నాలజీని వాడారు. కెమెరామెన్లు లేకుండానే కెమెరాలు వాటంత అవే పని చేయడం ప్రారంభించాయి. అయితే కెమెరామెన్లు లేకుండా చంద్రబాబు ప్రెస్ మీట్ చూసినవారు ఆశ్చర్యపోయారు. చంద్రబాబు ప్రెస్ మీట్ ఇచ్చేందుకుగాను హాల్లోకి రాగా ఒక కెమెరాకి కమాండ్స్ ఇచ్చారు. అది ఆయన్ని ఫోకస్ చేసింది. రికార్డ్ చేయడం మొదలు పెట్టింది. ఆ తరువాత మిగతా కెమెరాలు కూడా తమ ప్రదేశాల నుంచి ఫోకస్, రికార్డింగ్ మొదలుపెట్టాయి. అన్ని కెమెరాలు, స్వయంగా ఆయన్ని సెంట్రల్ ఫ్రేమ్‌లో పెట్టాయి. ఇలా లైవ్ కవరేజ్ అద్భుతంగా వచ్చింది. ఎక్కడ ఏ సమస్య రాలేదు.
* మంత్రి లోకేష్ చొరవ
అయితే ఈ ఏఐ వ్యవస్థతో కెమెరాలను మంత్రి నారా లోకేష్( Nara Lokesh) ఏర్పాటు చేయించారు. అందుకు సొంత ఖర్చులే పెట్టారు. 8 మంది వ్యక్తులు చేసే పని.. ఏఐ కారణంగా ఒక్క వ్యక్తితో చేయడానికి వీలవుతోంది. అంటే ఆటోమేటిక్‌గా జరిగిపోయింది. దావోస్ పర్యటనకు సంబంధించి వివరాలను వెల్లడించేందుకు చంద్రబాబు ఈ ప్రెస్ మీట్ పెట్టారు. దాదాపు గంట పాటు మాట్లాడారు. అంతసేపు కెమెరాలు బాగానే పనిచేశాయి. అలా ఈ టెక్నాలజీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. టెక్నాలజీ గురు అంటూ టిడిపి అభిమానులు సోషల్ మీడియాలో చంద్రబాబుకు అభినందనలు తెలుపుతున్నారు.
* గతంలో ఐటీ కి ప్రాధాన్యం
గతంలో చంద్రబాబు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి( information technology) అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. ఐటీ కి ప్రాధాన్యం ఇచ్చింది చంద్రబాబు మాత్రమే. కొత్తగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రాధాన్యమిస్తున్నారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రోన్లపై పడ్డారు. అన్ని శాఖలు డ్రోన్ సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు. ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణ సైతం రూపొందించినట్లు తెలుస్తోంది.