IPS Officer Abhishek Mohanty: తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి అభిషేక్ మెహంతిని సర్వీసులోకి తీసుకుంది. కొద్ది రోజులుగా ఆయన ఉద్యోగంలో కొనసాగకపోవడంతో ఖాళీగానే ఉన్నారు. మొదట ఆంధ్రప్రదేశ్ కేడర్ లో ఉద్యోగం చేసినా తరువాత కాలంలో తెలంగాణకు రావాలని ప్రయత్నించినా సర్కారు మాత్రం చేర్చుకోలేదు. దీంతో ఆయన ఖాళీగానే ఉండిపోవడం గమనార్హం. ఎట్టకేలకు ఆయనను తెలంగాణ ప్రభుత్వం సర్వీసులోకి తీసుకోవడంతో వివాదానికి తెరపడినట్లు అయింది.

రాష్ట్ర విభజన సమయంలో అభిషేక్ ఆంధ్ర కేడర్ కు వెళ్లారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సమయంలో ఆయన కర్నూలు జిల్లా ఎస్పీగా సేవలందిస్తున్నారు. చంద్రబాబు హయాంలో అభిషేక్ అక్కడే విధులు నిర్వహించారు. వివేకా హత్య కేసు నేపథ్యంలో ఆయన అక్కడ ఉండటం సురక్షితం కాదని ఆయన తండ్రి ఏకే మహంతిని కొడుకును తెలంగాణకు వెళ్లాలని సూచించారు. దీంతో ఆయన తెలంగాణకు కేటాయించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది.
Also Read: Hero Prabhas: మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్
ఏడు నెలలుగా మెహంతి ఖాళీగానే ఉన్నారు. తెలంగాణకు రావాలని న్యాయపోరాటం నిర్వహించారు. తనకు తెలంగాణ రాష్ట్రమే కావాలని పట్టుబట్టారు. దీంతో ఎట్టకేలకు మెహంతి కోరిక నెరవేరింది. సర్వీస్ లో చేరడంతో గొడవ సద్దుమణిగింది. క్యాట్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీసులో చేర్చుకోవడం గమనార్హం. మొదట్లో మాత్రం తెలంగాణ కూడా ససేమిరా అంది. దీంతో ఆయన ఇన్ని రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది.
దీనిపై శాసనసభలో కూడా నిన్న చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ సివిల్ సర్వీస్ అధికారులపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో అభిషేక్ మెహంతి వ్యవహారం కూడా కొద్ది రోజులుగా వివాదాస్పదంగానే మారింది. దీంతో ప్రభుత్వం సర్వీసులోకి తీసుకోవడంతో ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. మొత్తానికి అభిషేక్ మెహంతి అనుకున్నది సాధించారు. ఈయన ఎవరో కాదు గతంలో డీజీపీగా చేసిన ఏకే మెహంతి కుమారుడు కావడం తెలిసిందే.
Also Read: SS Rajamouli- Allu Aravind: రాజమౌళిని మోసం చేసిన అల్లు అరవింద్