Uday kiran Death Reason: తెలుగు తెర పై ‘ఉదయ్ కిరణ్’ అనే స్టార్ ముద్ర నేటికి చెదిరిపోలేదు. చాలామంది హీరోలకు అందం ఉంటుంది. కానీ, అందానికి పర్యాయపదం అంటే ఆ తరంలో శోభన్‌బాబు, ఈ తరంలో ‘ఉదయ్ కిరణే అనే స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు ఉదయ్. దానికి తగ్గట్టు లేడీస్ లో తిరుగులేని ఫాలోయింగ్ తో పాటు ఎవ్వరికీ సాధ్యం కానీ కీర్తిని సంపాధించుకున్నాడు.

పైగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సంచలనాలు సృష్టించాడు, ఒక్క హిట్ వస్తే చాలు అని మిగిలిన హీరోలు ఆశ పడుతున్న కాలంలో.. ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాడు. కానీ, కాలం కాటేసింది, జాతకం తిరగబడింది. వ్యక్తిగత జీవితంలో జరిగిన చిన్న సంఘటన కారణంగా ఉదయ్ కెరీర్ పూర్తిగా తలకిందులు అయ్యింది.
Also Read: రాకీ కట్టిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న శ్రీదేవి.. స్టార్ హీరో మోసం వల్లేనా?
అవకాశాలు ఇచ్చే స్థాయి నుంచి.. అవకాశాల కోసం కష్టపడే స్థాయికి పడిపోయాడు. చివరకు చనిపోయే వరకు కూడా కోలుకోలేకపోయాడు. అయితే, అసలు ఉదయ్ కిరణ్ చావుకి కారణం ఏమిటి ? అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ? అతని జీవితంలో జరిగిన బాధాకరమైన విషయం ఏమిటి ? ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
అయితే, ఆ మిస్టరీని ఇన్ డైరెక్ట్ గా ఓపెన్ చేశాడు నటుడు దిల్ రమేష్. ఓ ఇంటర్వ్యూలో దిల్ రమేష్ మాట్లాడుతూ.. ‘ఆది నువ్వు నేను సినిమా షూటింగ్ సమయం.. నేను ఆ సినిమాలో నటించాను. అనుకోకుండా ఉదయ్ కిరణ్ నాకు బాగా క్లోజ్ అయ్యాడు. మేము చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అప్పటికీ ఉదయ్ కిరణ్ కు అది రెండో సినిమానే.

ఉదయ్ కిరణ్ – నేను షూటింగ్ లేనప్పుడు కూడా చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. నన్ను ఓ బ్రదర్ లా చూసేవాడు. ఇక ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకి కారణం ఒత్తిడినే. ఆ సమయంలో ఉదయ్ కిరణ్ లోన్లీనెస్ గా ఫీల్ అయ్యేవాడు. మరోపక్క అవకాశాలు కూడా లేవు. దాంతో కాస్త మనస్తాపానికి గురైన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు’ అంటూ దిల్ రమేష్ ఎమోషనల్ గా చెప్పారు
Also Read: రాజమౌళిని మోసం చేసిన అల్లు అరవింద్
[…] Sajjanar Tweet About RRR: తెలంగాణ ఆఫీసర్ లలో వీసీ సజ్జనార్ రూటే సపరేటు. ఆయన ఏ సంస్థలో ఉంటే ఆ సంస్థకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుంటారు. పాత పద్ధతులను పక్కన పెట్టేసి వినూత్న ఆలోచనలతో తాను పని చేసే డిపార్ట్ మెంట్ కు గుర్తింపు తెస్తారు. గతంలో సైబర్ నేరాలపై ఎలాంటి అవగాహన కల్పించి ప్రజలకు ఎంత దగ్గరయ్యారో అందరం చూశాం. […]
[…] Also Read: Uday Kiran Death Reason: అందుకే ‘ఉదయ్ కిరణ్’ చనిపోయా… […]
[…] Nandamuri Balakrishna: ‘బాలయ్య బాబు’ అరవై ఏళ్ల వయసులో కూడా సినిమాల వేగం మాత్రం తగ్గించడం లేదు. దీనికి తోడు, ఈ మధ్య బాలయ్య క్రేజ్ డబుల్ అయింది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు అంతా బాలయ్యతో సినిమా అనగానే మొహం చాటేసేవాళ్ళు. ఇప్పుడు బాలయ్య డేట్లు కోసం పడిగాపులు కాస్తున్నారు. బాలయ్యతో సినిమాలు చేయాలని బడా నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. […]