AP Budget 2025: ఏపీలోని చంద్రబాబు సర్కారు ఏపీ బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడుతోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉదయం 10 గంటలకు సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. అంతకు ముందు ఉదయం 9 గంటలకు ఏబీ కేబినెట్ సమావేశమైంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఆమోదించింది. రూ.3.24లక్షల కోట్ల అంచనాలతో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. గత నవంబర్‌లో రూ.2.94 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. గత బడ్జెట్ కంటే ఈసారి 10 శాతం అధిక అంచనాలతో బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు సమాచారం. ఈ బడ్జెట్‌లో ఏయే శాఖలకు ఎంత కేటాయించనున్నారు..? ఏ పథకాలను ఎన్ని నిధులు ఇవ్వనున్నారు..? ఏపీ బడ్జెట్ ఎలా ఉండబోతుంది..? చూద్దాం.
Also Read: నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ ఎంపీ.. రెడ్ బుక్ లో ఉన్నది ఆయన పేరే?
– ఎస్సీ, ఎస్టీ, బీసీల స్కాలర్‌షిప్‌ల కోసం రూ.337 కోట్లు
– ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ కోసం రూ.400 కోట్లు
– ఆదరణ స్కీమ్ కోసం రూ.వెయ్యి కోట్లు
– డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కోసం రూ.3,486 కోట్లు
– రహదారుల నిర్మాణానికి రూ.4220 కోట్లు
– జలవనరుల శాఖకు రూ.18,020 కోట్లు
– పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు
– రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూ.10 కోట్లు
– ఎన్టీఆర్ భరోసా కోసం రూ.27,518 కోట్లు
– అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు
– పాఠశాల విద్యాశాఖకు రూ.31,806 కోట్లు
– ఆర్థికంగా వెనుకబడిన వాళ్ల సంక్షేమానికి రూ.10,619 కోట్లు
– రవాణా శాఖకు రూ.8,785 కోట్లు
– ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు
– సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు
– బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
–ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
– ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
పూర్తి బడ్జెట్ అంచనాలు ఇలా..
పూర్తి బడ్జెట్ రూ.3,22,359 కోట్లు
– రెవెన్యూ వ్యయం అంచనా– రూ.2,51,162 కోట్లు
– మూలధన వ్యయం అంచనా– రూ.40,635 కోట్లు
– వ్యవసాయ బడ్జెట్ రూ.48 వేల కోట్లు
Also Read: బాలయ్యతోనే పెట్టుకుంటారా.. దబిడ దిబిడే.. సీరియస్.. వైరల్ వీడియో