AP Budget 2025: ఏపీ అసెంబ్లీలో( AP assembly) మరి కాసేపట్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కూటమి ప్రభుత్వం. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెనాయుడు ప్రవేశపడతారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలకు మంత్రివర్గం సైతం ఆమోదముద్ర వేసింది. రూ. 3.24 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందుకు తీసుకు వస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఓటాన్ బడ్జెట్ కొనసాగుతూ వచ్చింది. ఈసారి మాత్రం పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు.
Also Read: నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ ఎంపీ.. రెడ్ బుక్ లో ఉన్నది ఆయన పేరే?
* సూపర్ సిక్స్ పథకాలకు నిధులు
ఈ ఎన్నికల్లో చంద్రబాబు ( Chandrababu) ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తామని. అయితే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్న నేపథ్యంలో.. సంక్షేమ పథకాల అమలుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. అందుకే ఈ వార్షిక బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చూస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే ఈ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేశవ్ బడ్జెట్ ప్రతులను అందించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి అధిక నిధులు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు.
* అమరావతిలో పూజలు
మరోవైపు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ( paiyavula kesav ) అమరావతి లోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి పాదాల చెంత బడ్జెట్ ప్రతులను ఉంచి పూజలు చేశారు. ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినట్లు సమాచారం. ఇప్పటికే హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన నిధుల కేటాయింపు చేసినట్లు సమాచారం.
* ఇప్పటివరకు ఓటాన్ బడ్జెట్
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. జూన్లోనే ప్రభుత్వం కొలువుదీరింది. అయితే అప్పటికే భారీగా సంక్షేమ పథకాలకు హామీలు ఇవ్వడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి వేలుగా.. రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. దానినే కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతుండడంతో సంక్షేమ పథకాలపై ఫుల్ క్లారిటీ రానుంది. ప్రధానంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాలకు నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర బడ్జెట్ పై సర్వత్ర ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read: 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్.. కేటాయింపులు ఇలా..