https://oktelugu.com/

Rajamouli: రాజమౌళి పై భారీ కుట్ర, శ్రీను వెనుక ఉంది ఎవరు?

రాజమౌళి ప్రతిష్టను దెబ్బ తీసేందుకు భారీ కుట్ర జరుగుతుందా? ఎవరీ శ్రీనివాసరావు? ఆయన వెనకుండి రాజమౌళి మీద ఆరోపణలు చేయిస్తుంది ఎవరు? టాలీవుడ్ లో తాజా పరిణామం ప్రకంపనలు రేపుతోంది.

Written By: , Updated On : February 28, 2025 / 11:32 AM IST
Rajamouli

Rajamouli

Follow us on

Rajamouli: దేశం మెచ్చిన దర్శకుడిగా ఉన్న రాజమౌళికి క్లీన్ హిస్టరీ ఉంది. రెండు దశాబ్దాలకు పైగా ఆయన పరిశ్రమలో కొనసాగుతున్నారు. తెలుగు సినిమా ప్రతిష్టను పెంచే చిత్రాలు చేశారు. తన సినిమా విషయంలో రాజమౌళి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. బిజినెస్, ఫైనాన్షియల్ మేటర్స్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాడు.కానీ రాజమౌళి మీద ఆర్థికపరమైన ఆరోపణలు లేవు. హీరోలు, హీరోయిన్స్ సైతం ఆయన గొప్ప వ్యక్తి అని కొనియాడినవారే. సడన్ గా శ్రీనివాసరావు అనే వ్యక్తి రాజమౌళి పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

Also Read: కథ ఎన్టీఆర్ కి నచ్చింది, బాలయ్యకు నచ్చలేదు… కట్ చేస్తే రిజల్ట్ చూసి అందరూ షాక్!

రాజమౌళికి ప్రాణ మిత్రుడిని అని చెప్తున్న శ్రీనివాసరావు… సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. 34 ఏళ్లుగా రాజమౌళితో స్నేహం ఉంది. రమతో మా ఇద్దరిది ట్రైయాంగిల్ లవ్ స్టోరీ. రాజమౌళి కోసం నేను రమను త్యాగం చేశాను. నేను ఒంటరిగా ఉండిపోయాను. అయితే గతంలో జరిగిన ఈ ప్రైవేట్ మేటర్స్ నేను ఇతరులకు చెబుతానని, బయటపెడతానని భయపడుతున్న రాజమౌళి నన్ను టార్చర్ చేస్తున్నాడు. వేధింపులకు పాల్పడుతున్నాడు. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇది పబ్లిసిటీ స్టంట్ అనుకుంటే పొరపాటు అవుతుంది. పాప్యులారిటీ కోరుకునేవారు చనిపోరు.

ఈ కేసును సుమోటోగా తీసుకుని, రాజమౌళికి లైడిటెక్టర్ టెస్ట్ చేయాలి. అప్పుడు నిజం బయటకు వస్తుంది. రాజమౌళి పెద్ద దర్శకుడు అయ్యాక నన్ను ఇబ్బందులకు గురి చేయడం మొదలుపెట్టాడంటూ.. వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోపై రాజమౌళి అభిమానులు మండి పడుతున్నారు. ఇది రాజమౌళి మీద జరుగుతున్న కుట్రలో భాగమే అంటున్నారు. అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళి సినిమా సినిమాకు మరో స్థాయికి వెళుతున్నాడు. రాజమౌళి ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు ఆయన ప్రతిష్టను దెబ్బ తీయాలని అనుకుంటున్నారు.

రాజమౌళి మీద శ్రీనివాసరావు అనే వ్యక్తితో ఆరోపణలు చేయిస్తున్నారు. శ్రీనివాసరావు వెనుక ఎవరో పెద్ద వ్యక్తులు ఉన్నారు.. అనే వాదన మొదలైంది. చిత్ర పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువ. విజయపథంలో దూసుకెళుతున్న వారిని కిందకు లాగాలని చూస్తుంటారు. ప్రస్తుతం రాజమౌళి SSMB 29 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మూవీ మొదలైంది. రాజమౌళి ఏకాగ్రతను ఈ వివాదాలు దెబ్బ తీసే ఆస్కారం కలదు.

పాన్ వరల్డ్ మూవీగా SSMB 29 తెరకెక్కుతుంది. మహేష్ బాబుకు జంటగా ప్రియాంక చోప్రా నటిస్తుంది. SSMB 29 యాక్షన్ అడ్వెంచర్ డ్రామా. ప్రపంచాన్ని చుట్టే వీరుడిగా మహేష్ బాబు పాత్ర ఉండనుంది. SSMB 29 కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

Also Read: శబ్దం’ ఫుల్ మూవీ రివ్యూ…