AP BJP: ఆంధ్రప్రదేశ్ పై( Andhra Pradesh) ఫుల్ ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. నాలుగు దశాబ్దాలుగా ఏపీలో బిజెపి కుదుటపడడం లేదు. ఏదో ఒక పార్టీతో పొత్తు ఉంటేనే ఓట్లు,సీట్లు పొందుతోంది. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పడం లేదు. అందుకే ఈసారి ఆ అవకాశం విడిచి పెట్టకూడదని.. సొంతంగానే ఓట్లు పెంచుకోవాలని చూస్తోంది. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. బిజెపి సారధ్య బాధ్యతలు సమర్థవంతమైన నేతకు అప్పగించడానికి సిద్ధపడుతోంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Also Read: ఆమె విషయంలో తోక ముడిచిన వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా
* పురందేశ్వరి సక్సెస్..
రెండేళ్ల కిందట ఏపీ బీజేపీ చీఫ్ గా పురందేశ్వరి( AP BJP Chief purandeswari ) నియమితులయ్యారు. ఆమె నేతృత్వంలో 2024 ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశం పార్టీతో పొత్తు, సమన్వయంతో ముందుకు సాగడంలో పురందేశ్వరి సక్సెస్ అయ్యారు. బిజెపికి ఓట్లతోపాటు సీట్లు సాధించి పెట్టారు. అందుకే ఆమె సేవలను కేంద్రంలో వినియోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో ఆమె కేంద్ర మంత్రివర్గంలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న బిజెపిలో అసంతృప్త స్వరాలు పెరుగుతున్నట్లు సమాచారం. దీనికి కారణం ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఇప్పటివరకు తెర వెనుక ఉన్న అసంతృప్త నేతలు సోము వీర్రాజు ఎమ్మెల్సీ కావడంతో యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. ఆయన పురందేశ్వరికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు ప్రచారంలో ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే పురందేశ్వరి స్థానంలో కొత్త వారిని నియమించాల్సిన అనివార్య పరిస్థితి హై కమాండ్ కు ఏర్పడింది.
* సుజనా చౌదరికి ఛాన్స్..
ఏపీ బీజేపీ పగ్గాలు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి( Sujana Chaudhari) ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరి సీనియర్ మోస్ట్ లీడర్. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. అయితే ఇప్పుడు పురందేశ్వరి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరికి బాధ్యతలు అప్పగిస్తే సమర్థవంతంగా నిర్వహిస్తారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆయన పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే సీఎం రమేష్, సుజనా చౌదరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అనకాపల్లి ఎంపీగా తన ముద్ర చాటుకున్నారు సీఎం రమేష్. కేంద్రంతో కూడా చక్కటి సమన్వయం చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో సుజనా చౌదరికి బాధ్యతలు ఇస్తే ఏపీలో బిజెపి బలపడే అవకాశం ఉంది.
* విభేదాలకు చెక్ చెప్పాలంటే..
చాలా రోజుల తర్వాత సోము వీర్రాజు( Somu veer Raj) పార్టీలో క్రియాశీలకంగా మారారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన వర్గం మరింత యాక్టివ్ అయ్యింది. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీలో విభేదాలు పెరుగుతూ వస్తున్నాయి. అందుకే సుజనా చౌదరిని ఎంపిక చేయడం ద్వారా సోము వీర్రాజు తోపాటు అసంతృప్త స్వరాలను కొంతవరకు నియంత్రించవచ్చని హై కమాండ్ భావిస్తోంది. త్వరలో ఏపీకి కొత్త చీఫ్ రావడం ఖాయమని తేలుతోంది. అయితే ఆర్ఎస్ఎస్ మదిలో వేరే నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సుజనా చౌదరి అయితేనే తట్టుకొని నిలబడగలరన్న టాక్ వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.