Homeఆంధ్రప్రదేశ్‌AP Auto Drivers Protest: ఉచిత ప్రయాణం.. ఆటో డ్రైవర్ల పరిస్థితేంటి!?

AP Auto Drivers Protest: ఉచిత ప్రయాణం.. ఆటో డ్రైవర్ల పరిస్థితేంటి!?

AP Auto Drivers Protest: ఏపీవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో( RTC bus) ఉచిత ప్రయాణం ప్రారంభం అయ్యింది. మహిళలు ఎంతగానో ఆనందిస్తూ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. దాదాపు రెండు కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. అయితే ఈ పథకం అమలు వల్ల ఆటోడ్రైవర్లపై దెబ్బ పడుతోంది. తమకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని వారంతా ఆవేదనతో ఉన్నారు. ఉచిత ప్రయాణ పథకంతో తమ ఉపాధికి గండి పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడే నిరసనబాటపడుతున్నారు. తిరుపతిలో ఉరి తాళ్లు వేసుకుంటూ వినూత్న నిరసన తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదో ఒక పథకం కింద సాయం చేయాలని కోరుతున్నారు.

Also Read: ఏపీలో ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం తొలిరోజు.. స్పందన ఎలా ఉందంటే?

దయనీయంగా పరిస్థితి..
రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల( auto drivers) పరిస్థితి దయనీయంగా ఉంది. వ్యక్తిగత వాహనాలు పెరుగుతుండడంతో ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుముఖం పడుతుంది. ఇలాంటి సమయంలో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. దీంతో వారంతా ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు దీనిపై కీలక ప్రకటన చేశారు. స్త్రీ శక్తి పథకంతో ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. త్వరలో ఈ పథకానికి సంబంధించి ప్రకటన రానుంది. అయితే స్త్రీ శక్తి పథకం ప్రారంభం నాటికే ఆటో డ్రైవర్లకు భరోసా ఇచ్చి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వైసిపి హయాంలో వాహన మిత్ర..
వైసిపి ప్రభుత్వ హయాంలో వాహన మిత్ర ( vahan Mitra )పథకం కింద ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయల నగదు సాయం చేసేవారు. ఇప్పుడు ఈ స్త్రీ శక్తి పథకంతో ఆటో డ్రైవర్లు పూర్తిగా ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో అంతకుమించి మంచి పథకం ప్రకటించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ పథకంతో రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని జత చేసి ప్రకటించాలని కోరుతున్నారు ఆటో డ్రైవర్లు. అప్పుడే తమకు ఆర్థిక భరోసా దక్కే అవకాశం ఉంటుందని.. లేకుంటే కష్టమని చెబుతున్నారు. నిన్ననే ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఆ సమయంలో ఆటో డ్రైవర్ల పథకం ప్రకటిస్తారని అంతా అంచనా వేసుకున్నారు. కానీ ఎటువంటి ప్రకటన రాకపోవడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు.

Also Read:  ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. వారికి మాత్రం 15 రోజుల తర్వాతే!

ఆటోలతో పెరిగిన ఉపాధి..
ఏపీలో ఆటో రంగం విస్తరించింది. ఏదో ఉపాధి మార్గంగా మారింది. ప్రతి గ్రామంలో నిరుద్యోగ యువత ఆటోలను కొనుగోలు చేసి అద్దెకు తిప్పుకుంటున్నాయి. అయితే వైసిపి( YSR Congress ) హయాంలో వాహన మిత్ర రూపంలో సహాయం చేసినా.. గుంతల రహదారులతో మరమ్మత్తులకు గురయ్యేవి. ఇప్పుడు రోడ్లు మెరుగుపడి పరవాలేదనిపించుకుంటున్న తరుణంలో స్త్రీ శక్తి పథకంతో మరోరకంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే మొన్ననే ఆటో డ్రైవర్ల సాయంపై చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ నిన్న జరిగిన ఉచిత ప్రయాణ పథక ప్రారంభంలో మాత్రం ఆ ప్రస్తావన లేదు. దీంతో వారిలో ఆందోళన రోజురోజుకు పెరుగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version