AP Free Bus Scheme Rules: ఏపీలో( Andhra Pradesh) మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి స్త్రీ శక్తి పథకం ఈరోజు ప్రారంభం కానుంది. మంగళగిరిలో సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం పథకాన్ని ప్రారంభించనున్నారు. అంటే ఈరోజు సాయంత్రం నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు అన్నమాట. కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన సలహా ప్రకారం ఈ పథకం ద్వారా మహిళలు, ట్రాన్స్ జెండర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది. ఉచిత ప్రయాణం కోసం మహిళలు ఆధార్, ఓటర్, రేషన్ కార్డును గుర్తింపుగా చూపించవచ్చు. వారికి జీరో ఫేర్ టిక్కెట్లు ఇస్తారు.
73% బస్సుల్లో ఉచిత ప్రయాణం..
రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీలోని( APSRTC) 73% బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ లలో మహిళాలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ప్రీమియర్ సర్వీసులు గా ఉన్న నాన్ స్టాప్, ఏసీ ఇంద్ర, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ వంటి బస్సులలో ఈ పథకం వర్తించదు. బస్సుల్లో రద్దీ దృష్ట్యా సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్ను ను కెమెరాలు అందించరున్నారు.
Also Read: ఆ వీడియోతో అంబటి రాంబాబు గుట్టు రట్టు!
సులువుగా తెలుసుకునేందుకు..
మరోవైపు ఈ పథకానికి సంబంధించి ఏ బస్సు కు వర్తిస్తుంది.. ఏ బస్సు కు వర్తించదు అని తెలుసుకునేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులకు స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఆకుపచ్చ రంగులో ఉండే పల్లె వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు బస్సులను సులువుగానే గుర్తించవచ్చు. ఎక్స్ప్రెస్ లో విషయంలో కొంత గందరగోళం ఉంది. అందుకే ఉచిత ప్రయాణం ఉన్న బస్సులపై స్త్రీ శక్తి పథకం వర్తిస్తుంది అనే స్టిక్కర్లను అతికిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుండడంతో విద్యార్థినులు, బాలికలకు సైతం వర్తించనుంది. అయితే ఇప్పటికే చాలామంది రాయితీ పాసులు తీసుకున్నారు. వాటి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. మరోవైపు మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం నెలవారి,సీజనల్ పాసులు తీసుకున్నారు. అటువంటి వారి పాసుల గడువు పూర్తయ్యే వరకు వారికి జీరో ఫేర్ టికెట్ల జారీ చేయరు. ఈ పాసుల గడువు ముగిసిన తర్వాతే వారికి ఉచిత ప్రయాణం వర్తించనుంది.