Koratala Siva Update: ఈమధ్య కాలం లో సీక్వెల్ ట్రెండ్ ఏ ఇండస్ట్రీ లో చూసినా వేరే లెవెల్ లో నడుస్తుంది. కచ్చితంగా సీక్వెల్ అనుకున్న సినిమాలకు సీక్వెల్ రావాలి, కానీ హైప్ కోసం ఈమధ్య ప్రతీ సినిమాకు సీక్వెల్ ని ప్రకటిస్తున్నారు. అలా అవసరం లేకపోయినా సీక్వెల్ ని ప్రకటించిన సినిమాల్లో ఒకటి ‘దేవర 2′(Devara 2). ఎన్టీఆర్(Junior NTR), కొరటాల శివ(koratala siva) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది విడుదలై కాస్త డివైడ్ టాక్ తో మొదలైనా, మళ్ళీ పుంజుకొని భారీ వసూళ్లను రాబట్టి కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. సుమారుగా 400 కోట్ల రూపాయిల ఘ్రోస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తామని డైరెక్టర్ కొరటాల శివ ముందుగానే చెప్పాడు. కానీ మొదటి భాగమే జనాలకు పెద్దగా నచ్చలేదు అనే విషయాన్నీ గ్రహించాలి. కేవలం ఎన్టీఆర్ స్టార్ డమ్ మీద నడిచిన సినిమా అది.
Also Read: మహేష్ తో మూవీ.. మరో పెద్ద ప్లాన్ వేసిన రాజమౌళి…
అందులో బలమైన స్టోరీ లేదు. అజ్ఞాతం లోకి వెళ్ళిపోయినట్టుగా దేవర నటించి,సముద్రాన్ని ఆధారంగా చేసుకొని అక్రమ పనులను చేపడుతున్న వారిని భయపడుతూ సముద్రం లోకి వచ్చిన వాళ్లకు వచ్చినట్టుగా నరుకుతూ ఉంటాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే ‘దేవర’ ఎప్పుడో చనిపోయాడు, ఆయనకు బదులుగా ఆయన కుమారుడు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఆ దేవర ని చంపింది మరెవరో కాదు, దేవర కొడుకే. ఎందుకు దేవర ని అతను చంపాల్సి వచ్చింది అనేది పార్ట్ 2 స్టోరీ. అచ్చు గుద్దినట్టు ‘కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు’ అనే కాన్సెప్ట్ ని మళ్ళీ రిపీట్ చేసినట్టుగా ఉందని ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరిలో కలిగిన భావం. ఇది కచ్చితంగా వర్కౌట్ అవ్వదు అని ఎన్టీఆర్ అభిమానులకు కూడా తెలుసు. కానీ డైరెక్టర్ కొరటాల శివ మాత్రం ఎన్టీఆర్ ని వదలలేదు. ఇప్పటికే సీక్వెల్ కోసం ఆయితణ్ణి నాలుగు సార్లు కలిసి స్టోరీ చెప్పాడు.
ALso Read: ‘వార్ 2’ కి తెలుగు లో ‘కింగ్డమ్’ కంటే తక్కువ ఓపెనింగ్స్..ఎన్టీఆర్ కి ఘోరమైన అవమానం!
ఇది మనకి వర్కౌట్ అవ్వదు అని ఎన్టీఆర్ కొరటాల శివ కు అనేక సార్లు చెప్పాడు కూడా. కానీ కొరటాల వదల్లేదు, నన్ను నమ్మండి అంటూ తిరిగాడు.రీసెంట్ గానే ఎన్టీఆర్ నుండి ‘వార్ 2′(War 2 Movie) విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అంత పెద్ద ఫ్రాంచైజ్ కి సంబంధించిన సినిమానే ఫ్లాప్ అయ్యిందంటే ఇక ‘దేవర’ సీక్వెల్ గురించి కచ్చితంగా ఆలోచించాల్సి ఉందని ఎన్టీఆర్ బలంగా నిర్ణయించుకున్నాడో ఏమో తెలియదు కానీ, రీసెంట్ గానే ఆయన కొరటాల శివ ని పిలిపించి ఈ సినిమా మనం చెయ్యడం లేదని తేల్చి చెప్పాడట. దీంతో ఇప్పుడు కొరటాల శివ కూడా వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయిపోయాడు. ఇప్పటికే నాగ చైతన్య(Naga Chaitanya) కి ఆయన రెండు మూడు కథలు చెప్పినట్టు తెలుస్తుంది.