Homeఆంధ్రప్రదేశ్‌AP Assembly Special Sessions: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. ఏంటి మేటర్

AP Assembly Special Sessions: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. ఏంటి మేటర్

AP Assembly Special Sessions: సాధారణంగా సీజన్ల వారీగా అసెంబ్లీ సమావేశాలు ( assembly sessions )జరగడం ఆనవాయితీ. కానీ ఇటీవల ఏపీలో మాత్రం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొన్న మధ్యన అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైన తీర్మానంపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి పది రోజుల్లో ప్రత్యేక సమావేశం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి పై తీర్మానం చేసిన కొద్ది రోజులకే మళ్ళీ సభ నిర్వహణకు సిద్ధపడుతుండడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చి ఉంటుందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది.

* మహిళా రిజర్వేషన్ బిల్లు పై చర్చించేందుకు..
ఇటీవల పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. విపక్షాలన్నీ ఐకమత్యంగా నిలిచి ఈ బిల్లును వ్యతిరేకించాయి. దీనిపై ఎన్డీఏ పరంగా ప్రజల మధ్యకు తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. పార్లమెంటులో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ తెర వెనుక ఏదో ఒక వ్యూహం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. అమరావతి రాజధాని కి కేంద్రం నుంచి చట్టబద్ధత లభించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అంటే చంద్రబాబు ఏదో పెద్ద స్కెచ్ తో ఉన్నారని పొలిటికల్ వర్గాల్లో ఒక అనుమానం ఉంది.

* తప్పకుండా ప్రత్యేకత..
అసెంబ్లీ సెషన్స్ అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంటుంది. ప్రధానంగా కీలక ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయం కోసమే ఈ ప్రత్యేక సమావేశం అన్నట్టు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది. క్యాబినెట్ మీటింగ్ లో సైతం చంద్రబాబు ఈ విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కనీసం ప్రస్తావించలేదు కూడా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు ఓకే కానీ.. మిగతా సహచర మంత్రుల విషయంలో ఈ విషయంలో ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. కానీ అత్యవసర నిర్ణయం పై చర్చించేందుకేనని సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం కోసం మాట్లాడేరే తప్ప అజెండాపై ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదని తెలుస్తోంది. కేవలం మహిళా బిల్లు పై చర్చించేందుకు మాత్రమేనని చిన్నపాటి సమాచారం ఇచ్చారు తప్పించి మరొకటి లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version