Antarvedi Beach Aggibaata Purugulu: అందాల తీర ప్రాంతం అంతర్వేది( antarvedi ). ఆధ్యాత్మిక కేంద్రం తో పాటు పర్యాటకుల మనసు దోచే ప్రాంతం. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం తో పాటు సాగర సంగమం, దీపస్తంభం, మడ అడవులు, బోటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ప్రాంతానికి అందుకే భక్తులు, పర్యాటకులు ఎక్కువగా తరలివస్తుంటారు. అయితే ఇటీవల అంతర్వేదిలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు తాజాగా విషపురుగులు దాడి చేయడంతో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు.
Also Read: గౌతమ్ గంభీర్ చూస్తుండగానే.. కోచ్ మీద పడి టీమిండియా ప్లేయర్ల కొట్లాట.. షాకింగ్ వీడియో
* జెల్లీ ఫిష్ గా పిలిచే అగ్గిపురుగులు..
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ( Dr Ambedkar Konaseema ) జిల్లాలో ఉంది అంతర్వేది. పెద్ద ఎత్తున పర్యాటకులు రాగా.. అప్పుడే అగ్గి బాట పురుగులు ప్రత్యక్షమయ్యాయి. బీచ్ లో స్నానాలు చేస్తున్న భక్తులు, పర్యాటకులు వీటి బారిన పడ్డారు. ఈ పురుగులు శరీరానికి తగిలినా, కుట్టినా ఆ భాగంలో వేడి మంటలు, దురదలు వస్తున్నాయి. గత రెండు రోజులుగా జెల్లీ ఫిష్లుగా పిలిచే ఈ పురుగులు అధికంగా కనిపిస్తున్నాయని పర్యాటకులు చెబుతున్నారు. వాతావరణం లో మార్పులు సంభవించే సమయంలో, సముద్రంలో అలజడులు ఏర్పడినప్పుడు ఈ విషపురుగులు తీరానికి వస్తుంటాయి. ప్రమాదకర జీవి కానప్పటికీ.. భక్తులపై విరుచుకుపడుతుండడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుండడంతో అటువైపుగా వెళ్లడానికి భక్తులు భయపడుతున్నారు.
* నిత్యం పర్యాటకుల తాకిడి..
అయితే ఈ ప్రాంతంలో నిత్యం పర్యాటకులు( tourists ) ఉంటారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన వారు అంతర్వేదిలో సముద్ర స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇది పర్యాటక మణిహారంగా ఉంటుంది. సువిశాల తీర ప్రాంతం ఈ సొంతం. అంతర్వేది నుంచి భైరవపాలెం వరకు 93 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. అంతర్వేది తో పాటు చింతలమోరి, వాడలరేవు, వాసాల తిప్ప, యానాం తదితర బీచ్ లు ఉన్నాయి. అయితే మిగతా తీరప్రాంతాల్లో కాకుండా అంతర్వేదిలోనే ఈ అగ్గిపురుగులు కనిపించడం విశేషం.
కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరంలో విష పురుగులు
అంతర్వేది బీచ్లో కొందరు పర్యాటకులపై దాడి చేసిన విష పురుగులు
విష పురుగులు వాలడంతో దురద, మంటలు, దద్దుర్లు వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్యాటకులు
వీటిని జెల్లీ ఫిష్ అని, సీ డ్రాగన్ ఫిష్ అని పిలుస్తారని తెలిపిన… pic.twitter.com/us96PCCToh
— Telugu Scribe (@TeluguScribe) June 29, 2025