Homeటాప్ స్టోరీస్ABN RK On KCR Phone Tapping: కేసీఆర్ అలా చేస్తున్నాడని.. రఘునందన్ రావుకు ముందే...

ABN RK On KCR Phone Tapping: కేసీఆర్ అలా చేస్తున్నాడని.. రఘునందన్ రావుకు ముందే తెలుసా.. ఆంధ్రజ్యోతి ఆర్కే బయటపెట్టిన నిజం!

ABN RK On KCR Phone Tapping: ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే. ఇటీవల ఆయన దర్యాప్తు బృందం అధికారుల పిలుపుమేరకు విచారణకు హాజరయ్యారు. తన వాంగ్మూలాన్ని వినిపించాడు. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న రెండు పర్యాయాలు తన ఫోన్ ఎలా విన్నది.. తనను ఏ జాబితాలో చేర్చింది.. దానివల్ల తనను ఇబ్బంది పెట్టిన విధానాన్ని రాధాకృష్ణ ప్రస్తావించాడు.. తన పత్రికకు ప్రకటనలు ఇవ్వకుండా రాధాకృష్ణ పేర్కొన్నాడు.. వాస్తవానికి ఇవన్నీ తెలిసిన విషయాలు అయినప్పటికీ.. కొత్త పలుకులో మరో కీలకమైన విషయాన్ని రాధాకృష్ణ పేర్కొన్నాడు.

Also Read: గౌతమ్ గంభీర్ చూస్తుండగానే.. కోచ్ మీద పడి టీమిండియా ప్లేయర్ల కొట్లాట.. షాకింగ్ వీడియో

దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రఘునందన్ రావు నిలబడ్డాడు. ఆ సమయంలో రఘునందన్ రావు గెలవకుండా భారత రాష్ట్ర సమితి అనేక ప్రయత్నాలు చేసింది. నాటి ఉప ఎన్నికల్లో స్వయంగా హరీష్ రావు రంగంలోకి దిగి వ్యవహారాన్ని మొత్తం పర్యవేక్షించారు. చివరికి రఘునందన్ రావు ఫోన్ ను కూడా నాటి ఇంటెలిజెన్స్ అధికారులు ట్యాప్ చేశారు. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను విన్నారు. అయితే ఈ విషయాన్ని ముందే పసి కట్టిన రఘునందన్ రావు అత్యంత తెలివిగా వ్యవహరించారు. ఫోన్ టాపింగ్ అవుతున్న విషయాన్ని తెలుసుకొని.. అధికారులను ముప్పు తిప్పలు పెట్టారు. అధికారులను బురిడీ కొట్టించడానికి పలానా వాహనంలో డబ్బు పంపిస్తున్నానని.. ఫలానా వ్యక్తి నుంచి డబ్బు వస్తుందని.. రఘునందన్ రావు ఫోన్లో మాట్లాడారు. ఆ మాటలు విన్న అధికారులు అవి నిజమనుకొని తనిఖీలు చేపట్టారు. ఆ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. భాగాలుగా విడదీసి మరీ చూశారు.. అయినప్పటికీ వారికి డబ్బులు లభించలేదు.

ఇదే విషయాన్ని వేమూరి రాధాకృష్ణ ఆదివారం రాసిన కొత్త పలుకులో ప్రస్తావించారు.. కెసిఆర్ ఫోన్ టాపింగ్ ద్వారా ఎంతోమంది రాజకీయ నాయకుల జీవితాలను ప్రభావితం చేశారని.. అయితే రఘునందన్ రావు మాత్రం తన తెలివి ద్వారా ఏకంగా కేసీఆర్ నే బురిడీ కొట్టించాడని.. అధికారులకు దమ్కీ ఇచ్చాడని రాధాకృష్ణ తన కొత్త పలుకులో పేర్కొన్నాడు. ఇక ఇటీవల రఘునందన్ రావు సిట్ అధికారులకు తన వాంగ్మూలం వినిపించాడు. వాంగ్మూలం వినిపించిన తర్వాత రఘునందన్ రావు మాట్లాడినప్పటికీ.. ఈ విషయాన్ని వెల్లడించలేదు. అయితే కెసిఆర్ అసలు నిజం ప్రజలకు తెలియాలి కాబట్టి.. రాధాకృష్ణ కొత్త పలుకులో ఇలా రాసినట్టు తెలుస్తోంది..

భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీద తెలంగాణలో అనధికారికంగా నిషేధం ఉండేది. ఏబీఎన్ ఛానల్ ప్రసారాలను నిలిపివేయడంతో రాధాకృష్ణ ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. సుదీర్ఘంగా విచారణ సాగినప్పటికీ విజయం సాధించి.. తెలంగాణలో తన ఛానల్ ప్రసారాలను పున ప్రారంభించుకున్నాడు. కెసిఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఆంధ్రజ్యోతికి ప్రభుత్వపరంగా ప్రకటనలు రాలేదు. అయినప్పటికీ తన ఛానల్ నిర్వహించాడు. పత్రికను కొనసాగించాడు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version