Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి( Posani Krishna Murali ) షాక్ తగిలింది. బెయిల్ వచ్చిన జైలు నుంచి మాత్రం ఆయన విడుదల కాలేదు. సిఐడి పోలీసులు వేయడమే దానికి కారణం. ఈ క్రమంలో పోసాని ఉన్న కర్నూలు జిల్లా జైలుకు గుంటూరు సిఐడి పోలీసులు వెళ్లారు. పిటి వారెంట్ పై పోసానిని కోర్టులో హాజరు పరచనున్నారు. కర్నూలు జైలు నుంచే ఆన్లైన్లో సిఐడి పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి గుంటూరు తరలించే అవకాశం ఉంది. ఇటీవల ఆయనకు అన్ని కేసులలో బెయిల్ లభించింది. కానీ సిఐడి పీటి వారెంట్ తో విడుదల నిలిచిపోయింది. సరిగ్గా బెయిల్ పై విడుదలై బయటకు వెళ్తున్న క్రమంలోనే పోసానికి షాక్ ఇచ్చారు ఏపీ సిఐడి పోలీసులు.
Also Read: బొమ్మల పిచ్చితో దేన్నీ వదల్లే.. జగన్ పై లోకేష్ సంచలన కామెంట్స్!
* వివాదాస్పద వ్యాఖ్యలతో..
కొద్ది రోజుల కిందట పోసాని కృష్ణ మురళి అరెస్టు జరిగిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పాటు పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో హైదరాబాదులో ఉన్న పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదుల నేపథ్యంలో పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయనకు వరుసగా రిమాండ్లు విధించారు. అయితే అనారోగ్య కారణాలు చూపుతూ ఆయన బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. అయితే సిఐడి అధికారులు పీటీ వారెంట్ జారీ చేయడంతో కోర్టు ముందుకు హాజరు కావాల్సిన అవసరం ఏర్పడింది. అయితే కర్నూలు జిల్లా జైలు నుంచి.. గుంటూరు కు తరలించే అవకాశం ఉంది.
* కస్టడీల మీద కస్టడీలు..
అయితే ఇప్పటికే పోసాని కృష్ణ మురళిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట టూ టౌన్ పోలీసులు( Narasaraopet Town Police ) కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు కోర్టు విచారణను నేటికీ వాయిదా వేశారు. ఈరోజు కోర్టు తీర్పు వచ్చి కస్టడీకి ఇస్తే పరిస్థితి ఏంటనేది చర్చ జరుగుతోంది. ఈనెల 3న నరసరావుపేట పోలీసులు పోసానిని అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలు నుంచి పిటి వారెంట్ పై తీసుకెళ్లి స్థానిక కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించగా.. ఆయనను ప్రశ్నించేందుకు వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈనెల 3న నరసరావుపేట కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు వినిపించగా.. ఈనెల 8, 9 తేదీల్లో కృష్ణ మురళిని పోలీసుల కస్టడీకి అనుమతించింది. అనంతరం రెండు రోజులకే విజయవాడ భవానిపురం పోలీసులు పిటి వారెంట్ పై తీసుకెళ్లారు. దీంతో నరసారావు పేట పోలీసులు కస్టడీకి తీసుకోవడం జరగలేదు. అందుకే నరసరావుపేట పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇంతలో పోసానికి విజయవాడలోని చీఫ్ జ్యుడీషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ బెయిల్ ఇచ్చింది. ఆదోనిలో నమోదైన కేసులను బెయిల్ వచ్చింది. దీంతో కృష్ణ మురళి విడుదల ఖాయమని భావించారు. కానీ సిఐడి పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు.
Also Read: ప్రజల చేతిలో ప్రభుత్వం.. ఏపీ ప్రభుత్వం మరో గొప్ప ముందడుగు