Y S Jagan Mohan Reddy, : వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )గట్టి వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు లక్ష్యంగా హెచ్చరికలు జారీ చేశారు. 2029 లో వచ్చేది మేమే అంటూ సవాల్ చేశారు. జువ్వలదిన్నె హార్బర్ ను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానిని గుర్తుచేస్తూ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు జగన్. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కొద్దిరోజులుగా మత్స్యకారుల వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆ ప్రాంతాన్ని సందర్శించిన జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు.
* హార్బర్ల ప్రైవేటీకరణ తగునా?
మరోసారి కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలపై స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లను దుర్మార్గంగా ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో నాలుగు పోర్టులు, పది హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు పనులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. దాదాపు 26 వేల కోట్ల పెట్టుబడులతో వీటి పనులను ప్రారంభించామని.. కానీ కూటమి ప్రభుత్వం కొనసాగించలేక పోయిందని చేశారు. మత్స్యకారుల విషయంలో రాష్ట్రంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి.
* స్వాధీనం చేసుకుంటాం..
జువ్వలదిన్నె హార్బర్ ఎవరికైనా ఇస్తే స్వాధీనం చేసుకుంటామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అసలు ఏడాదిన్నర కిందట జాతికి అంకితం చేసిన హార్బర్ ను మత్స్యకారులకు ఎందుకు అందించలేదని మండిపడ్డారు. ఈ హార్బర్ ను నమ్ముకుని 25వేల కుటుంబాలు బతుకుతున్నాయని గుర్తు చేశారు. మత్స్యకారులకు కాదని డిఫెన్స్ కంపెనీలకు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని.. ఇది ఎంత మాత్రం తగదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తిరిగి తీసుకుంటామన్నారు. హార్బర్లు అనేవి మత్స్యకారుల సొత్తు అని.. చంద్రబాబు కాదు కదా అంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కొనసాగదని.. ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు అంటూ జగన్ హెచ్చరికలు జారీ చేశారు.