YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) అధినేత జగన్ కు అండగా కొంతమంది రంగంలోకి దిగారా? మేధావుల ముసుగులో కూటమి ప్రభుత్వంపై విష ప్రచారానికి దిగునున్నారా? వీకెండ్ లో హైదరాబాదులో రహస్య భేటీలు నిర్వహిస్తున్నారా? కడప జిల్లాకు చెందిన మాజీ ఐఏఎస్ సారథ్యం వహిస్తున్నారా? రిటైర్డ్ అధికారులతో పాటు ప్రస్తుత అధికారులు మంత్రాంగం చేస్తున్నారా? సుమారు పాతికమంది ఈ బృందంలో ఉన్నారా? తప్పుడు ప్రచారం చేయడమే అజెండానా? బ్యూరోక్రాట్ తెలివితేటలను వాడాలని నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతల స్వీకరించారు. ఆ సమయంలో మేధావుల ముసుగులో కొందరు సీనియర్ అధికారులు, నాయకులు ఒక బృందంగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డికి గౌరవ సలహాదారులుగా వ్యవహరించారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు.
Also Read: ఎంత ట్రోలింగ్ చేస్తే.. అంత ఆదాయం.. అదే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాజిక్కూ!
* అసంతృప్త అధికారులు..
సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేక వర్గం అంటూ ఉంటుంది. ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే తమకు అనుకూలమైన అధికారులను కీలక పోస్టుల్లో నియమించడం సర్వసాధారణం. అయితే ఈ పోస్టులను ఆశించి భంగపడ్డ అధికారులను అప్పట్లో జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) చేరదీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బిజెపితో భాగస్వామ్యం అయింది. అయితే ఒక వ్యూహం ప్రకారం ఎన్డీఏకు టిడిపి దూరమయ్యేలా వ్యవహరించారు నాటి మేధావుల ముసుగులో ఉన్న పెద్దలు. అప్పట్లో టిడిపి అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ఈ వ్యూహం పన్నారు. కానీ ఈసారి కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేధావుల ముసుగులో కొంతమంది అధికారులు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.
* ఆ బృందానికి సారధ్యం ఆయనే..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక కీలక అధికారిగా వ్యవహరించిన సదరు వ్యక్తి ప్రభుత్వంపై వ్యతిరేక తప్పించేలా ప్రచారం చేసే బృందానికి సారథ్యం వహించినట్లు తెలుస్తోంది. సార్ కోసం కలిసి పని చేద్దాం.. మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం. మనందరికీ మంచి రోజులు వస్తాయి అని.. మాజీ అధికారులు, ప్రస్తుత అధికారులకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈయన సారధ్యంలో మేధావులు, తటస్తులు, మాజీ అధికారులు, సామాజికవేత్తలు తదితర ముసుగులో ఉన్న వ్యక్తులను ఒకే వేదిక పైకి తెచ్చినట్లు సమాచారం. 2014 నుంచి 2019 మధ్య నాటి టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఈ బృందంలో కలుపుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సర్కారులో కీలక అధికారిగా ఒక వ్యక్తి వ్యవహరించారు. ఆయన పదవీ విరమణ తర్వాత కూడా గౌరవ సలహాదారుగా నియమించారు. అటువంటి వ్యక్తి గత ఐదేళ్ల వైసిపి పాలనలో టిడిపికి వ్యతిరేకంగా మాట్లాడారు. బిజెపిలో చేరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. ఆ మాజీ అధికారి సైతం ఈ బృందంలో చేరినట్లు తెలుస్తోంది.
* కడప అధికారి నేతృత్వంలో..
జగన్మోహన్ రెడ్డికి ఒక వీరభక్తుడిగా కడప( Kadapa district ) జిల్లాకు చెందిన ఒక అధికారి పని చేశారన్న విమర్శ ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఎందరో సీనియర్లను పక్కనపెట్టి ఆయనను జగన్ ప్రధాన పోస్టులో కూర్చోబెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేయడానికి ఆయనకే బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డి అంటే ఇద్దరు అధికారులకు పడేది కాదు. ఇప్పుడు అదే అధికారులు జగన్ కోసం ఒకటయ్యారు. వీకెండ్ నాడు హైదరాబాదులోని హైటెక్ సిటీ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై విష ప్రచారానికి అత్యంత పకడ్బందీగా వ్యూహం పన్నుతున్నట్లు సమాచారం. అయితే 2019 ఎన్నికలకు ముందు ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వారి ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి.
Also Read: పది మామిడి చెట్లు.. కేజీఎఫ్ గోల్డ్ కంటే విలువైన పండ్లు.. కాపలాగా కుక్కలు.. చదవాల్సిన స్టోరీ ఇదీ!