Annadata Sukhibhava Update: ఏపీ ప్రభుత్వం( AP government ) రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టత వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెనాయుడు స్పష్టతనిచ్చారు. అన్నదాత సుఖీభవ సాయాన్ని మూడు విడతల్లో అందిస్తామని చెప్పారు. మొదటి విడతగా రూ.7000 ఈనెల 24 ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. దీంతో అన్నదాత సుఖీభవ పథకంపై ఒక క్లారిటీ వచ్చినట్లు అయింది. అదే రోజు పిఎం కిసాన్ విడుదల కానుండడంతో.. అన్నదాత సుఖీభవ మొత్తాన్ని కలిపి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈరోజు విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ కానున్నాయి. ఇదే నెలలో ఇప్పుడు అన్నదాత సుఖీభవ అమలు కానుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
* ఖరీఫ్ ప్రారంభం నేపథ్యంలో..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్( kharif) పనులు ప్రారంభమయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడ్డాయి. దీంతో రైతులు వరి ఆకుమడులను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఖరీఫ్ పనులు ప్రారంభం అవుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు సిద్ధపడింది. కేంద్రం మాదిరిగా మూడు విడతల్లో ఈ సాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈనెల 20న కేంద్రం అందించే 2000 రూపాయలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 5000 అందించనుంది. మిగతా మొత్తాన్ని మరో రెండు విడతల్లో అందించేందుకు నిర్ణయించింది.
* వైసీపీ సైతం..
వైసిపి ప్రభుత్వం( YSR Congress government ) నవరత్నాల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది. ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయల సాగు సాయం అందిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం అందించే ఆరువేల రూపాయలకు తోడుగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 7500 జత కలిపి… 13,500 అందించారు. అయితే తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 20వేల రూపాయల మొత్తాన్ని అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కేంద్రం అందించే రూ.6000 కు తోడు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.14000 అందించి… మొత్తం 20 వేల రూపాయలు అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.
* మూడు విడతల్లో సాయం..
కేంద్ర ప్రభుత్వం( central government) ఏడాదిలో మూడు సార్లు పీఎం కిసాన్ అందిస్తూ వస్తోంది. మూడుసార్లు రెండు వేల రూపాయల చొప్పున అందిస్తోంది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ విషయంలో సైతం కేంద్రాన్ని అనుసరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తొలివిడతగా రూ.5000, రెండో విడతగా మరో రూ.5000, చివరి విడతగా రూ.4000 అందించనుంది. అంటే తొలి రెండు విడతల్లో రూ.7000 చొప్పున.. చివరి విడత రూ.6000 చొప్పున అందించనుందన్నమాట. అంటే ఈ నెల 20న తొలి విడతగా రూ.7000 అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెనాయుడు స్పష్టతనిచ్చారు.