Pawan Kalyan : కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సరిగ్గా ఏడాది పూర్తి చేసుకోవడంతో నేడు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లతో పాటు ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం ఇచ్చిన ప్రసంగాలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఏడాది కాలం లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరాయించడమే కాకుండా, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి కూడా వివరించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. పరిపాలనలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడమే కాకుండా, వైసీపీ పార్టీ నాయకులు ఈమధ్య కాలంలో చేస్తున్న కొన్ని అరాచక వ్యాఖ్యలపై మండిపడుతూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.
అంతే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు పవన్ కళ్యాణ్ ఒక శుభవార్త ని చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ‘చంద్రబాబు అపారమైన అనుభవం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రానున్న రోజుల్లో యువతకు 20 లక్షల ఉద్యోగాల భర్తీ కి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. అధికారం లోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయిల పెన్షన్ ని అందించాము. ఉచిత గ్యాస్ సీలిండెర్స్ ఇచ్చాము. తల్లికి వందనం పేరిట పది వేల కోట్ల రూపాయిలు తల్లుల ఖాతాలో జమ చేసాము. గత ప్రభుత్వ పాలనలో ప్రతీ సంక్షేమ పధకానికి ఆయా వ్యక్తుల పేర్లు ఉండేవి. కానీ ఇక్కడ మన రాష్ట్రము కోసం పని చేసిన మహోన్నత వ్యక్తుల పేర్లను స్మరించుకుంటూ మంత్రి నారా లోకేష్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయం’ అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ ని పునరుద్దించడంలో మా కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. ఈ ఏడాది కాలంలో 9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చాము. తద్వారా త్వరలోనే 6 లక్షలకు పైగా యువతకు ఉద్యోగ కల్పన చేయబోతున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా తన ఆధ్వర్యం లో నడుస్తున్న పంచాయితీ రాజ్ శాఖ ద్వారా గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు, పంటకాలువలు తొవ్వించడం, గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, ఇలా ఎన్నో కార్యక్రమాలను చేపట్టానని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.